Boycott Laal Singh Chaddha: ఆమీర్ ఖాన్ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండింగ్.. ఆ కామెంట్స్ వల్లే..

ABN , First Publish Date - 2022-07-31T17:11:31+05:30 IST

బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘లాల్ సిండ్ చద్దా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రిమేక్‌గా ..

Boycott Laal Singh Chaddha: ఆమీర్ ఖాన్ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండింగ్.. ఆ కామెంట్స్ వల్లే..

బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘లాల్ సిండ్ చద్దా’. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రిమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆమీర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor), టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన చిత్ర ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఈ సినిమా ఆగస్టు 11, 2022న విడుదల కానుంది. నిజానికి ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే.. ఈ మూవీపై కొన్ని నెలల క్రితం బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో Boycott Laal Singh Chaddha యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. సినిమా విడుదల కానున్న ఈ తరుణంలో మరోసారి ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.


ఓ సందర్భంలో ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మన దేశం చాలా సహనంతో ఉంది. కానీ చెడును వ్యాప్తి చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. మన పిల్లల భద్రత కోసం దేశం విడిచి వెళ్లడం మంచిదని నా భార్య కిరణ్ రావు చెప్పింది’ అని వ్యాఖ్యానించాడు. కానీ.. ఆ తర్వాత ఆమీర్, కిరణ్ రావ్ విడాకులు తీసుకున్నారు. కాగా.. ఈ కామెంట్స్ చాలామందికి కోపం తెప్పించాయి. ఇవి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు అంటూ అంటూ విమర్శలు గుప్పించారు.


అలాగే.. కరీనా కపూర్ సైతం ఓ సందర్భంలో బాలీవుడ్‌లో నేపోటిజం గురించి మాట్లాడుతూ.. ‘మా సినిమాలను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తున్నారు. అందుకే సినిమాలు చేస్తున్నాం. నెపోటిజం అని మాట్లాడేవాళ్లకి నచ్చకపోతే మా సినిమాలు చూడడం మానేయండి. మిమ్మల్ని మా మూవీస్ చూడమని ఎవరూ బలవంతం చేయట్లేదు కదా’ అంటూ వెటకారంగా మాట్లాడింది. ఈ బ్యూటీ కామెంట్స్‌పై సైతం అప్పట్లో విమర్శలు వచ్చాయి. 


ఆమీర్, కరీనా సినిమా విడుదల కానున్న తరుణంలో ఈ నటులు గతంలో చేసిన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కొంచెం కూడా గౌరవం లేకుండా మాట్లాడిన వారి సినిమా ఫ్లాప్ చేయాలి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అందుకే Boycott Laal Singh Chaddha యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.











Updated Date - 2022-07-31T17:11:31+05:30 IST