Liger కి బాయ్‌కాట్‌ సెగ..

ABN , First Publish Date - 2022-08-20T19:10:14+05:30 IST

విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ (Liger) కి బాయ్‌కాట్‌ సెగ తగిలింది.. ‘లైగర్‌’ని బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. దీనిని తిప్పికొడుతూ విజయ్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

Liger కి బాయ్‌కాట్‌ సెగ..

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ‘లైగర్‌’ (Liger) కి బాయ్‌కాట్‌ సెగ తగిలింది.. ‘లైగర్‌’ని బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. దీనిని తిప్పికొడుతూ విజయ్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. విజయ్‌ ఎలాంటి సపోర్ట్‌ లేకుండానే స్టార్ అయ్యారని.. ఆయనకెప్పుడూ తమ సపోర్ట్‌ ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా మృతి చెందిన తరువాత నుంచి హిందీ చిత్రాలపై బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతోంది. హిందీలో విడుదలైన కొన్ని సినిమాలని బాయ్‌కాట్ ‘చేయిండి’.. అంటూ నెట్టింట ట్రోలర్స్ తయారవుతున్నారు. 


ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ సినిమా 'లాల్ సంగ్ చడ్డా'పై కూడా ఇదే బాయ్‌కాట్ ట్రెండ్ తీవ్ర ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. మూవీ ఫ్లాపవడానికి ప్రధాన కారణం ఇదే అని అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అయితే, ఇప్పుడు ఇదే బాయ్‌కాట్ ఫీవర్ విజయ్ దేవరకొండ నటించిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ మూవీ 'లైగర్' ని చుట్టుకుంటోంది. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం యూనిట్ దాదాపు మూడేళ్లుగా శ్రమించింది. ఎట్టకేలకు ఈ మూవీ ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతోంది. 5 భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో #BoycottLigerMovie అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుండటం హాట్ టాపిక్ గా మారింది. 


దీనికి కారణం కరణ్ జోహార్, అనన్యా పాండే అని తెలుస్తోంది. కరణ్ జోహార్ ఈ సినిమాకి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అనన్య పాండే ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు కనుకే ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ కొంత మంది నెటిజన్స్ నెట్టింట #BoycottLigerMovie హ్యాష్ ట్యాగ్ తో హడావుడి చేస్తున్నారు. అయితే, దీనికి విజయ్ దేవరకొండ అభిమానులు కూడా గట్టి సమధానమిస్తూ #UnstoppableLIGER అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.

Updated Date - 2022-08-20T19:10:14+05:30 IST