Brahmastra: వర్కౌట్ కాని బాయ్‌కాట్ ‘బ్రహ్మాస్త్ర’

ABN , First Publish Date - 2022-09-09T01:20:12+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ క్రేజీ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో,

Brahmastra: వర్కౌట్ కాని బాయ్‌కాట్ ‘బ్రహ్మాస్త్ర’

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). బీ టౌన్ క్రేజీ కపుల్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం కోసం రూ.410కోట్ల భారీ బడ్జెట్‌‌ను వెచ్చించారు. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేశారు. మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’  (BoycottBrahmastra) ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ, ఎన్ని రోజుల పాటు ట్రెండ్ అయినప్పటికి ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.    


ట్రైలర్‌లోని ఒక సన్నివేశం ఓ వర్గం వారి మనోభావాలను గాయపరిచేలా ఉంది. రణ్‌బీర్ కపూర్ షూస్ వేసుకుని గుడి లోపలికి ప్రవేశిస్తాడు. ఈ సీన్‌తో సోషల్ మీడియా యూజర్స్‌కు కోపం వచ్చింది. ఫలితంగా వారు ‘బ్రహ్మాస్త్ర’ ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్శకుడు అయాన్ ముఖర్జీ అప్పట్లోనే స్పందించాడు. వివరణ కూడా ఇచ్చాడు. కానీ, బాయ్‌కాట్ ట్రెండ్ సద్దుమణిగినట్టు అనిపించిన అది కొత్తగా రూపాంతరం చెందింది. రణ్‌బీర్, ఆలియా‌లు గతంలో చేసిన వ్యాఖ్యలను కొంత మంది వెలుగులోకి తీసుకువచ్చారు. రణ్‌బీర్ గతంలో తాను బిగ్ భీప్ బాయ్ అని చెప్పుకొన్నాడు. ఆలియా కూడా తనను వెండితెర మీద చూడాలనుకంటెనే సినిమాకు రావాలని తెలిపింది. తనను చూడటం ఇష్టం లేకపోతే రావొద్దని చెప్పింది. దీంతో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర మరోసారి ట్రెండింగ్‌లో నిలిచింది. అయినప్పటికి, ‘బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర’ వర్కౌట్ కాలేదు. కొన్ని రోజుల క్రితం ‘బ్రహ్మాస్త్ర’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. బాయ్‌కాట్ ట్రెండ్‌ను ఎవరు లెక్క చేయలేదు. ప్రేక్షకులు టిక్కెట్స్‌ను బుక్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. ఈ  బుకింగ్స్ ద్వారానే చిత్రం కోట్లల్లో వసూళ్లను సాధించింది. కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద మూవీని ఆపడం ఎవరి తరం కాదు. తొలి రోజే ఈ సినిమా రూ.25కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు నెట్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఫస్ట్ వీకెండ్‌కు ఈ కలెక్షన్స్ రూ.75కోట్లను దాటుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వసూళ్లను బట్టి బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.

Updated Date - 2022-09-09T01:20:12+05:30 IST