Boycott Alia Bhatt: డార్లింగ్ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండింగ్.. మగాళ్లను అలా చూపిస్తారా అంటూ..

ABN , First Publish Date - 2022-08-04T17:15:53+05:30 IST

బాలీవుడ్‌లో ఆలియా భట్‌(Alia Bhatt)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఓ సినిమా కమర్షియల్ సినిమాలు చేస్తూనే..

Boycott Alia Bhatt: డార్లింగ్ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండింగ్.. మగాళ్లను అలా చూపిస్తారా అంటూ..

బాలీవుడ్‌లో ఆలియా భట్‌(Alia Bhatt)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఓ సినిమా కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సాధించింది. ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘డార్లింగ్స్(Darlings)’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 5న విడుదల కానున్న ఈ మూవీలో విజయ్ వర్మ, షఫాలీ షా, రోషన్ మాథ్యూ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది.


అందులో.. చాలా ఇళ్లలో మహిళలపై హింస జరుగుతుంది. అదే వారికి కోపం వచ్చి రివర్స్‌లో మగాళ్లపై హింస చేస్తే ఏం జరుగుతుందనేది ఈ చిత్ర కథాంశం. ఈ ట్రైలర్‌పై చాలామంది ప్రశంసలు కురిపించినప్పటికి.. కొందరికీ మాత్రం కోపం తెప్పించింది. ఆ సినిమాలో మగాళ్లపై గృహహింసని ప్రమోట్ చేస్తున్నారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా Boycott Alia Bhatt అనే యాష్‌ట్యాగ్‌ని ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే.. మరికొందరు ఈ విషయంలో ఆలియాకి సపోర్టుగా నిలుస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.


ట్రైలర్‌లో ఏముందంటే..

జస్మీత్ కే రీన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలియా పాత్ర పేరు బద్రునిస్సా షేక్. ఆమె భర్త హంజా పాత్రలో విజయ్ వర్మ నటించాడు. హంజా కిడ్నాప్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హంజా చేతిలో బద్రునిస్సా వేధింపులకు గురవుతుంది. అందుకే బద్రునిస్సా, ఆమె తల్లి (షెఫాలీ షా) హంజాను కిడ్నాప్ చేసి.. అతను బద్రుకి చేసినట్లే హింసిస్తారు. బయటివాళ్లకి మాత్రం హంజా కిడ్నాప్ అయినట్లు పోలీసు కంప్లైట్ ఇస్తారు. అలాగే.. హంజాను వివిధ రకాలుగా హింసించడం ట్రైలర్‌లో కనిపిస్తుంది.

















Updated Date - 2022-08-04T17:15:53+05:30 IST