బాలీవుడ్ fast food... సౌత్ సినిమాలు full meals అంటోన్న Boney Kapoor

ABN , First Publish Date - 2022-03-08T04:28:31+05:30 IST

బాలీవుడ్‌ని సౌత్ సినిమా డామినేట్ చేస్తోందా అన్న ప్రశ్నకు నిర్మాత బోనీ కపూర్ ఆసక్తికరంగా స్పందించారు. దక్షిణాది చిత్రాలు ఫ్యామిలీ డ్రామాతో కూడుకున్న కంప్లీట్ ప్యాకేజ్ అంటూ కితాబునిచ్చారు. అంతే కాదు...

బాలీవుడ్ fast food... సౌత్ సినిమాలు full meals అంటోన్న Boney Kapoor

బాలీవుడ్‌ని సౌత్ సినిమా డామినేట్ చేస్తోందా అన్న ప్రశ్నకు నిర్మాత బోనీ కపూర్ ఆసక్తికరంగా స్పందించారు. దక్షిణాది చిత్రాలు ఫ్యామిలీ డ్రామాతో కూడుకున్న కంప్లీట్ ప్యాకేజ్ అంటూ కితాబునిచ్చారు. అంతే కాదు, ప్రస్తుతం కొందరు ముంబై ఫిల్మ్‌మేకర్స్ వ్యవహారం ‘కేఎఫ్‌సీ’లా తయారైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేస్తే అది మాత్రమే కేఎఫ్‌సీలో తెచ్చి పెట్టినట్టు హిందీ సినిమా దర్శకనిర్మాతలు ప్రవర్తిస్తున్నారట. కానీ, అదే సమయంలో సౌత్ ఫిల్మ్ మేకర్స్ అన్నం, పప్పు, రోటీ, చికెన్... ఇలా అన్ని పదార్థాలతో విందు భోజనం వడ్డిస్తున్నారని బోనీ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌కు, దక్షిణాదికి మధ్య తేడాని మరింతగా వివరిస్తూ, ఆయన... చాలా వరకూ సౌత్ ఫిల్మ్ ఇండియన్ ఆడియన్స్‌ అందరికీ నచ్చేలా ఉంటాయని వ్యాఖ్యానించారు. 


అటు హిందీలోనూ, ఇటు తెలుగు, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తోన్న బోనీ కపూర్ లెటెస్ట్‌గా అజిత్ కుమార్ ‘వలిమై’ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. అంతకు ముందు కూడా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో ‘పింక్’ రీమేక్ ‘నెర్కొండ పార్వై’ని ఆయన రూపొందించారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాకి కూడా బోనీ ఓ నిర్మాతగా వ్యవహరించారు. వరుసగా సౌత్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఇక్కడి సినిమాల్ని ఆకాశానికి ఎత్తటం ప్రస్తుతం బీ-టౌన్‌లో చర్చగా మారింది...  

Updated Date - 2022-03-08T04:28:31+05:30 IST