పాన్ ఇండియా అనే పదాన్ని వాడటం అగౌరవప్రదం: సిద్దార్థ్

ABN , First Publish Date - 2022-05-01T21:07:21+05:30 IST

దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’ ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కెజియఫ్-2’ చిత్రాలు బీ టౌన్‌లో సంచలన విజయాన్ని నమోదు చేశాయి.

పాన్ ఇండియా అనే పదాన్ని వాడటం అగౌరవప్రదం: సిద్దార్థ్

దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్నాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కెజియఫ్-2’ చిత్రాలు బీ టౌన్‌లో సంచలన విజయాన్ని నమోదు చేశాయి. ఈ మూవీస్ అన్ని దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కావడంతో పాన్ ఇండియా అనే పదం బాగా వాడుకలోకి వచ్చింది. సినిమాలను అగౌరవపరచడానికే ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారని హీరో సిద్దార్థ్ చెప్పాడు.


ప్రాంతాల వారీగా సినిమాలను ఎందుకు వేరు చేసి చూస్తారని సిద్దార్థ్ పేర్కొన్నాడు ‘‘చిత్రాలన్నింటిని ఇండియన్ ఫిలిమ్స్‌గా ఎందుకు పరిగణించకూడదు.  వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సినిమాలను పిలవడానికి పాన్ ఇండియా అనే పదం ఉపయోగిస్తున్నారు. అందువల్లే ఈ పదం బాగా వాడుకలోకి వచ్చింది. బాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలను ఆ విధంగా పిలవరు. అందుకే పాన్ ఇండియా అనే పదం అగౌరవప్రదం’’అని సిద్దార్థ్ చెప్పాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా సినిమాను భారతదేశ వ్యాప్తంగా చూశారని అతడు వెల్లడించాడు. అది తమిళ సినిమా అయినప్పటికీ పాన్ ఇండియా అని ఎవరు పిలవలేదని స్పష్టం చేశాడు. 15ఏళ్ల క్రితం ఆ పదం ఎందుకు వాడుకలో లేదని అతడు ప్రశ్నించాడు. పాన్ ఇండియా అనే పదాన్ని తొలగించాలన్నాడు. అన్ని చిత్రాలను ఇండియన్ ఫిలిమ్స్ అని పిలవాలన్నాడు లేదా ఏ భాషలో తెరకెక్కితే ఆ విధంగా సంబోధించాలని తెలిపాడు.

Updated Date - 2022-05-01T21:07:21+05:30 IST