Vikram Gokhale: ప్రముఖ నటుడి మృతి

ABN , First Publish Date - 2022-11-26T23:03:47+05:30 IST

హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించుకున్న నటుడు విక్రమ్ గోఖలే (Vikram Gokhale). పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

Vikram Gokhale: ప్రముఖ నటుడి మృతి

హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించుకున్న నటుడు విక్రమ్ గోఖలే (Vikram Gokhale). పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. పుణెలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికి ఆయన స్పందించలేదు. దీంతో వి‌క్రమ్ నవంబర్ 26న 82ఏళ్ల వయసులో మృతి చెందారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. 


విక్రమ్ గోఖలే తండ్రి చంద్రకాంత్ గోఖలే థియేటర్ ఆర్టిస్ట్‌గా పనిచేసేవారు. అందువల్ల విక్రమ్‌కు చిన్న తనంలోనే సినిమాలు, నాటకాలపై ఆసక్తి కలిగింది. దీంతో బాలీవుడ్‌ కెరీర్‌ను పర్వానా (Parwana) సినిమాతో ప్రారంభించారు. అనంతరం ‘స్వర్గ్ నరక్’, ‘ఇన్సాఫ్’ తదితర చిత్రాల్లో నటించారు. 1990లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘అగ్నిపథ్’ (Agneepath) మూవీ ఆయనకు గేమ్ చేంజర్‌గా మారింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌‌కు ధీటుగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. 1999లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాతో గోఖలే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. 

Updated Date - 2022-11-26T23:03:47+05:30 IST