సౌత్ సినిమాను రీమేక్ చేస్తానంటున్న బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్

Twitter IconWatsapp IconFacebook Icon
 సౌత్ సినిమాను రీమేక్ చేస్తానంటున్న బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్

బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు. డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్, హోస్ట్‌ వంటి పాత్రలు కూడా పోషిస్తుంటాడు. ధర్మ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ కూడా అతడికీ ఉంది. ‘బాహుబలి’ని హిందీలో కరణే డిస్ట్రిబ్యూట్ చేశాడు. కరణ్ జోహార్ తాజాగా ఓ సౌత్ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 


మలయాళంలో భారీ విజయం సాధించిన సినిమా ‘హృదయం’. ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను కరణ్ జోహార్ కొనుగోలు చేశాడు. హిందీ, తెలుగు, తమిళ్‌లో రీమేక్ చేస్తానని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ట్విట్టర్‌లో ఓ మెసేజ్‌ను షేర్ చూస్తూ అభిమానులతో పంచుకున్నాడు. ‘‘మలయాళంలో న్యూ ఏజ్ లవ్‌స్టోరీగా రూపొందిన ‘హృదయం’ సినిమా హక్కులను ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సొంతం చేసుకున్నాయి. ఈ వార్తను మీ అందరితో పంచుకోవడానికి నేను ఎంత‌గానో సంతోషిస్తున్నాను. హిందీ, తెలుగు, తమిళ్‌‌‌లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తాం. ఈ మూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలోనే మీకు అందిస్తాను. మీరందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలి’’ అని కరణ్ జోహార్ తెలిపాడు. దాదాపుగా ఐదేళ్ల అనంతరం కరణ్ జోహార్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా రణ్‌వీర్ సింగ్, అలియా భట్ నటిస్తున్నారు.  


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.