Laal Singh Chaddha: ఆ సినిమానే కాపీ చేశారా..? ట్విటర్లో Aamir Khan పై నెటిజన్ల ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ABN , First Publish Date - 2022-05-31T01:56:39+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్( Aamir Khan) నటించిన తాజా సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha). కరీనా కపూర్ (Kareena Kapoor) హీరోయిన్‌గా నటించింది. నాగచైతన్య (Naga Chaitanya)

Laal Singh Chaddha: ఆ సినిమానే కాపీ చేశారా..? ట్విటర్లో Aamir Khan పై నెటిజన్ల ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్( Aamir Khan) నటించిన తాజా సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha). కరీనా కపూర్ (Kareena Kapoor) హీరోయిన్‌గా నటించింది. నాగచైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఫైనల్‌లో రెండో స్ట్రాటజిక్ టైమ్డ్ ఔట్‌లో ఆమిర్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. టామ్ హాంక్స్ (Tom Hanks) నటించిన ‘ఫారెస్ట్ గంప్’ (Forest Gump)కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. 1994లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’ భారీ విజయం సాధించి క్లాసిక్‌గా నిలిచింది. ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి కొంత మంది ప్రేక్షకులు దానిని మెచ్చుకుంటుంటే, మరికొంత మంది మాత్రం ఆమిర్ ఖాన్‌ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి టామ్ హాంక్స్, ఫారెస్ట్ గంప్ హాష్ ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్ కావడం మొదలయ్యాయి.  


ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో  టామ్ హాంక్స్ పర్‌ఫార్మెన్స్‌ను చెడగొట్టడని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమిర్ గత సినిమాలు ‘దూమ్-3’, ‘పీకే’ లకు కొనసాగింపుగా ఉందంటున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ ను రీమేక్ చేయడమే పెద్ద తప్పని మరికొంతమంది పేర్కొంటున్నారు. ‘‘ఇది ‘ఫారెస్ట్ గంప్’ కాదు. ఫారెస్ట్ డంప్. సినిమా ఇండస్ట్రీలోనే ‘ఫారెస్ట్ గంప్’ గొప్ప సినిమా. ‘లాల్ సింగ్ చద్దా’ లో ఒక్క సీన్ కూడా చూడాలనిపించేలా లేదు. ఐకానిక్ మూవీని ఆమిర్ ఎందుకు రీమేక్ చేశాడో’’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ‘లాల్ సింగ్ చద్దా’ ను వయాకాం 18 స్టూడియోస్‌, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆగస్టు 11న విడుదల కానుంది. 



Updated Date - 2022-05-31T01:56:39+05:30 IST