రాత్రయితే చాలు పార్టీలే... షారుఖ్ కొడుకు Aryan Khan నుంచి Amitabh మనవరాలి దాకా...

ABN , First Publish Date - 2021-10-05T22:17:54+05:30 IST

షారుఖ్ కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే, బాలీవుడ్ గురించి బాగా తెలిసిన వారికి ఇదేమంత ఆశ్చర్యం కాదు. ఎందుకంటే, బీ-టౌన్‌లో సూర్యుడు అస్తమిస్తే చాలు పార్టీలు మొదలైపోతాయి. క్లబ్బుల్లో, పబ్బుల్లో, ప్రైవేట్ ఫామ్‌హౌజుల్లో బాలీవుడ్ జనాలు మద్యం మత్తులో తూగుతుంటారు. వారి లైఫ్‌స్టైల్లో అది అంతర్భాగం!

రాత్రయితే చాలు పార్టీలే... షారుఖ్ కొడుకు Aryan Khan నుంచి Amitabh మనవరాలి దాకా...

షారుఖ్ కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే, బాలీవుడ్ గురించి బాగా తెలిసిన వారికి ఇదేమంత ఆశ్చర్యం కాదు. ఎందుకంటే, బీ-టౌన్‌లో సూర్యుడు అస్తమిస్తే చాలు పార్టీలు మొదలైపోతాయి. క్లబ్బుల్లో, పబ్బుల్లో, ప్రైవేట్ ఫామ్‌హౌజుల్లో బాలీవుడ్ జనాలు మద్యం మత్తులో తూగుతుంటారు. వారి లైఫ్‌స్టైల్లో అది అంతర్భాగం!


తెల్లవారుఝాము నాలుగు దాకా పార్టీలు చేసుకోవటం నిన్నటి తరం బాలీవుడ్ వారికి కూడా పరిపాటే. మరి వార్ని చూసి ఆర్యన్ ఖాన్ లాంటి ఈతరం స్టార్ కిడ్స్ నేర్చుకోకుండా ఉంటారా? డ్రగ్స్ సంగతి ఏమోగానీ చాలా మంది బీ-టౌన్ యంగ్‌స్టర్స్ పార్టీల్లో మద్యం మాత్రం ఫుల్లుగా సేవించేస్తుంటారు. వారి పార్టీల ఫోటోలు కూడా సొషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్ అవుతుంటాయి. షారుఖ్ కొడుకు నుంచీ అమితాబ్ మనవరాలి దాకా అందరూ ఇదే కోవలోకి రావటం, కాస్త ఆలోచించాల్సిన విషయమే!


సముద్రంలో... షిప్ మీద పార్టీ చేసుకుంటూ ఎన్సీబీకి చిక్కిన ఆర్యన్ ఖాన్ లాగే అతని సోదరి కూడా పార్టీ యానిమల్. కింగ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ రెగ్యులర్‌గా పార్టీల్లో తళుక్కుముంటూ ఉంటుంది. అయితే, ఆమెతో ఎప్పుడూ గాళ్ గ్యాంగే ఉంటుంది. అమ్మాయిలందరూ కలసి తెగ హడావిడి చేస్తుంటారు. సుహానా బెస్ట్ ఫ్రెండ్స్‌లో అనన్య పాండే కూడా ఒకరు. సీనియర్ నటుడు చంకీ పాండే కూతురుగా ఆమె ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేసింది.


సుహానా, అనన్యతో పాటూ రెగ్యులర్‌గా పార్టీస్‌లో కనిపించే మరో స్టార్‌ కిడ్ షనాయా కపూర్. ఈమె బోణీ కపూర్, అనీల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ కూతురు. అంటే... సోనమ్, జాన్వీ లాంటి బాలీవుడ్ బ్యూటీస్‌కి షనాయా చెల్లెలన్నమాట. త్వరలో బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ యంగ్ బ్యూటీ. 


శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సైతం వీలు చిక్కినప్పుడల్లా పార్టీల్లో కనిపిస్తుంటుంది. ఈమె హల్‌చల్ మొత్తం మన ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చు. జాన్వీ తన పార్టీ ఫోటోలు, ఫ్రెండ్స్‌తో కలసి కెమెరాకు ఇచ్చిన ఫోజులు రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. 


బాలీవుడ్ పార్టీ జీవుల లిస్టులో సైఫ్ కొడుకు, అమితాబ్ మనవరాలు కూడా ఉన్నారు. జూనియర్ పటౌడీ... ఇబ్రహీం అలీఖాన్... చాలా సార్లు పార్టీ చేసుకుంటూ కెమెరాలకు చిక్కాడు. అలాగే, బిగ్ బి కూతురు శ్వేత బచ్చన్ వారసురాలు నవ్యా నవేలీ నందా కూడా విందులు, వినోదాలతో వార్తల్లో నిలిచింది. ఈమెకు తెర మీదకు యాక్టర్‌గా వచ్చే ఉద్దేశం లేనప్పటికీ బీ-టౌన్ సర్కిల్స్‌లో మాత్రం చాలా ఫేమస్. నవ్య నందా పార్టీ పిక్స్‌ని యూత్ చాలా సార్లు వైరల్‌గా షేర్ చేస్తుంటారు... 

Updated Date - 2021-10-05T22:17:54+05:30 IST