‘ఆహా’ Allu Arjun అంటోన్న టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్...

ABN , First Publish Date - 2022-02-22T03:18:36+05:30 IST

నిన్న, మొన్నటి వరకూ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇప్పటికీ విదేశాల్లో భారతీయ చిత్రాలు అంటే ప్రధానంగా హిందీ సినిమాల పేర్లే వినిపిస్తాయి. కానీ, క్రమంగా సీన్ మారిపోతోంది. సౌత్ చిత్రాలు బీ-టౌన్‌ను షేక్ చేస్తున్నాయి. అంతే కాదు, మన దక్షిణాది నటీనటులు కూడా ముంబైలో క్రేజీగా మారిపోతున్నారు. లెటెస్ట్‌గా ‘పుష్పరాజ్’ అసలు ‘తగ్గేదేలే’ అంటున్నాడు...

‘ఆహా’ Allu Arjun అంటోన్న టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్...

నిన్న, మొన్నటి వరకూ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇప్పటికీ విదేశాల్లో భారతీయ చిత్రాలు అంటే ప్రధానంగా హిందీ సినిమాల పేర్లే వినిపిస్తాయి. కానీ, క్రమంగా సీన్ మారిపోతోంది. సౌత్ చిత్రాలు బీ-టౌన్‌ను షేక్ చేస్తున్నాయి. అంతే కాదు, మన దక్షిణాది నటీనటులు కూడా ముంబైలో క్రేజీగా మారిపోతున్నారు. లెటెస్ట్‌గా ‘పుష్పరాజ్’ అసలు ‘తగ్గేదేలే’ అంటున్నాడు...


హిందీ బాక్సాఫీస్ మార్కెట్ వద్ద కూడా 100 కోట్ల మార్క్ దాటేసిన అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ బాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీల్ని ఫిదా చేసేసింది. వారిలో రాజ్‌కుమార్ రావ్ కూడా ఉన్నాడు. తన చిత్రాల్లో అద్భుతంగా నటిస్తాడని పేరున్న ఆయన కూడా బన్నీని ‘ఆహా’ అంటూ పొగిడేయకుండా ఉండలేకపోయాడు! ‘పుష్ప’ సినిమా చూసిన రాజ్‌కుమార్ ఐకాన్ స్టార్‌కి ప్రత్యేకంగా మెసేజ్ పంపించాడట. చక్కగా నటించావని మెచ్చుకుంటూనే ఫ్యూచర్లో మనం కలసి నటిద్దామని అన్నాడట!


కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు... రాజ్‌కుమార్ రావ్‌ను మెస్మరైజ్ చేసిన మరికొందరు సౌత్ యాక్టర్స్ ఉన్నారు. వారితోనూ ఏదో ఒక రోజు తప్పక స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటున్నాడు బీ-టౌన్ స్టార్. జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌ని ఆయన రెండు, మూడు సార్లు కలిశాడట. అలాగే, ‘పుష్ప’ మూవీ ఫేమ్ ఫాహద్ ఫాసిల్‌ తనకు మంచి ఫ్రెండ్ అని రాజ్‌కుమార్ రావ్‌ చెప్పాడు. ఇక కమల్ హసన్ గురించి చెప్పేదేముంది? ఆయనకి నేను ఫ్యాన్ అంటున్నాడు బాలీవుడ్ యాక్టర్. 


ప్రస్తుతం భూమి పెడ్నేకర్ స్టారర్ ‘బధాయి దో’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న రాజ్‌కుమార్ రావ్... ఫ్యూచర్‌లో అల్లు అర్జున్, ధనుష్, ఫాహద్ ఫాసిల్, కమల్ హసన్ వంటి తన అభిమాన దక్షిణాది నటులతో మల్టీ స్టారర్స్ చేయాలని మనమూ కోరుకుందాం... 

Updated Date - 2022-02-22T03:18:36+05:30 IST