తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
ABN , First Publish Date - 2022-03-21T20:27:59+05:30 IST
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి సోనమ్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘సావరియా’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘నీర్జా’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘సంజు’ వంటి చిత్రాల్లో నటించి అభిమానులను అలరించింది.
సోనమ్ కపూర్ తాజాగా అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. భర్త ఆనంద్ అహూజాతో కలసి బేబీ బంప్‌తో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘మా నాలుగు చేతులతో సాధ్యమైనంత అద్భుతంగా నిన్ను పెంచుతాం. నువ్వు తీసుకునే ఊపిరి కోసం రెండు హృదయాలు ఎదురు చూస్తున్నాయి. ఒక కుటుంబం నీ మీద ప్రేమాభిమనాలు కురిపించడానికి ఎదురు చూస్తుంది. నిన్ను ఈ భూమి మీదకు స్వాగతించేందుకు మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాం’’ అని సోనమ్ కపూర్ పేర్కొంది. ఈ శుభవార్తను తెలిపిన కాసేపటికే సోనమ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ సెలబ్రెటీస్ కామెంట్స్ పోస్ట్ చేశారు.
సోనమ్ కపూర్ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజాను 2018లో పెళ్లి చేసుకుంది. లండన్‌లో ఓ సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు 2015లో సోనమ్‌కి, ఆనంద్ పరిచయమయ్యాడు. అనంతరం వీరిద్దరూ 3ఏళ్ల పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు.