రణ్‌బీర్‌ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకోలేదు.. గతంలో ఆలియా భట్ ఇంకేం చెప్పిందో తెలుసా..?

ABN , First Publish Date - 2022-04-21T21:45:06+05:30 IST

బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు.

రణ్‌బీర్‌ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకోలేదు.. గతంలో  ఆలియా భట్ ఇంకేం చెప్పిందో తెలుసా..?

బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అయాన్ ముఖర్జీ, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయి సందడి చేశారు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆలియాకు రణ్‌బీర్ అంటే ఎంతో ఇష్టం. కానీ, ఒకానొక సందర్భంలో రణ్‌బీర్‌ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకోలేదనీ.. జోక్ చేశానంటూ చెప్పుకొచ్చింది. అసలు అప్పట్లో ఆలియా ఏం చెప్పిందంటే..


బీ టౌన్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ గతంలో ఓసారి ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొంది. తనకు అవకాశం లభిస్తే రణ్‌బీర్‌ను పెళ్లి చేసుకుంటానని ఆ షోలో మాటల సందర్భంలో ఆమె చెప్పింది. దీంతో ఆమె వ్యాఖ్యలు కాస్తా విపరీతంగా వైరల్ అయ్యాయి. నెట్టింట వార్తలుగా పుట్టుకొచ్చాయి. ఆమె ఏమనుకున్నదో ఏమో కానీ.. ఈ విషయంపై కొన్ని రోజులకే మాట మార్చింది. ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ రణ్‌బీర్‌తో పెళ్లిపై తాను జోక్ చేశానని స్పష్టం చేసింది. ‘‘నేను రణ్‌బీర్ అభిమానిగా ఆ మాటను అన్నానంతే. అంత మాత్రాన పెళ్లి చేసుకుంటానని కాదు’’ అంటూ ఆలియా క్లారిటీ ఇచ్చింది. కానీ, రణ్‌బీర్ అభిమానిగా ఆలియా అన్న మాటలే ఆ తర్వాతి కాలంలో నిజమయ్యాయి. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా సెట్‌లో వీరిద్దరికీ పరిచయం అవడం.. ఆ తర్వాత ఒకరికొకరు నచ్చడం, అనంతరం వారిద్దరూ ప్రేమలో పడటం అందరికీ తెలిసిందే. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. ఎట్టకేలకు ఇటీవల పెళ్లితో తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించారు.

Updated Date - 2022-04-21T21:45:06+05:30 IST