‘‘ సెల్ఫీ ’’లతో సినిమాను ప్రకటించిన అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ.. టీజర్ విడుదల..

ABN , First Publish Date - 2022-01-13T00:05:53+05:30 IST

అక్షయ్ కుమార్ వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. ఆ చిత్రం పేరు ‘‘ సెల్ఫీ’’. ఇమ్రాన్ హష్మీ

‘‘  సెల్ఫీ ’’లతో సినిమాను ప్రకటించిన అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ.. టీజర్ విడుదల..

అక్షయ్ కుమార్ వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పారు. ఆ చిత్రం పేరు ‘‘ సెల్ఫీ’’. ఇమ్రాన్ హష్మీ కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజ్ మెహతా దర్శకత్వం వహించనున్నారు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాలీవుడ్ హిట్ చిత్రమైన ‘‘ డ్రైవింగ్ లైసెన్స్‌ ’’కు  రీమేక్‌గా ఆ చిత్రం తెరకెక్కబోతుంది. షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సినిమాకు సంబంధించిన టీజర్‌ను జనవరి 12న విడుదల చేశారు. 


మూవీ టీజర్‌ను విడుదల చేయక ముందు తమ సోషల్ మీడియా అకౌంట్‌లల్లో  అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ వేర్వేరుగా ఒకే ఫోజుల్లో సెల్ఫీలను పోస్ట్ చేశారు. ‘‘ సెల్ఫీ ’’ టీజర్‌ను కరణ్ జోహార్ సోషల్ మీడియా అకౌంట్‌లో విడుదల చేశారు. ‘‘ ఇద్దరు స్మాషింగ్ నటులైన అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. రాజ్ మెహతా దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తాం ’’ అని కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. అంతకు ముందు ఇమ్రాన్ హష్మీతో తీసుకున్న సెల్ఫీని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ నాకు సరి అయిన సెల్ఫీ భాగస్వామి దొరికారు’’ అని అక్కీ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.



Updated Date - 2022-01-13T00:05:53+05:30 IST