నర్సు వేషంలో బాలీవుడ్ స్టార్ హీరో.. సమంత రిప్లై ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-04T01:00:16+05:30 IST

స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన

నర్సు వేషంలో బాలీవుడ్ స్టార్ హీరో.. సమంత రిప్లై ఏంటంటే..

స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే హీరోగా పేరు తెచ్చుకున్న అందగాడు వరుణ్ ధావన్. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఏబీసీడీ’, ‘కలంక్’, ‘కూలీ నెం-1’ వంటి సినిమాల్లో నటించి ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. తాజాగా వరుణ్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నెట్టింట ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే..


వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కూలీ నెం-1’. సారా అలీఖాన్ హీరోయిన్‌గా నటించింది. ‘కూలీ నెం-1’ సెట్లో సారాతో తీసుకున్న ఫొటోను వరుణ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘అందంగా ఎవరు కనిపిస్తున్నారు?’ అని అడిగాడు. ‘‘నేను కోడిపిల్ల లాగా డ్రెస్ వేసుకుంటే సారా అలీఖాన్ నన్ను చూసి ఇంప్రెస్ అయ్యింది’’ అని వరుణ్ రాశాడు. నర్సు డ్రెస్ వేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేశాడు. వరుణ్ షేర్ చేసిన పిక్‌కు సమంతతో సహా అనేక మంది సెలబ్రెటీలు కామెంట్ చేశారు. ‘‘నువ్వు చాలా హాట్‌గా ఉన్నావు’’ అంటూ సారా పేర్కొంది. ఈ ఫొటోకు లాఫింగ్ ఎమోజీతో సమంత రిప్లై ఇచ్చింది. ‘కూలీ నెం-1’ సినిమాను డేవిడ్ ధావన్ తెరకెక్కించాడు. వాసు భగ్నానీ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రం 1995లో విడుదలైంది. రెండు దశాబ్దాల అనంతరం 2020లో అదే పేరుతో ఈ సినిమాను రీమేక్ చేశారు. 



Updated Date - 2022-03-04T01:00:16+05:30 IST