బాలీవుడ్‌లో బిగ్ క్లాష్.. షారూఖ్ ఖాన్ vs అక్షయ్ కుమార్..

ABN , First Publish Date - 2022-04-23T00:06:48+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ దాదాపుగా ఐదేళ్ల అనంతరం వెండితెర పైన మెరవనున్నాడు. ‘సైజ్ జీరో’ అనంతరం అతడు తెర మీద కనిపించలేదు. ప్రస్తుతం కింగ్ ఖాన్ ‘పఠాన్’, ‘లయన్’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

బాలీవుడ్‌లో బిగ్ క్లాష్.. షారూఖ్ ఖాన్ vs అక్షయ్ కుమార్..

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ దాదాపుగా ఐదేళ్ల అనంతరం వెండితెర పైన మెరవనున్నాడు. ‘సైజ్ జీరో’ అనంతరం అతడు తెర మీద కనిపించలేదు. ప్రస్తుతం కింగ్ ఖాన్ ‘పఠాన్’, ‘లయన్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపాడు. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ‘డంకీ’ అనే సినిమాను ప్రకటించాడు. 


‘డంకీ’ సోషల్ కామెడీగా తెరకెక్కనున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ చిత్రంలో తాప్సీ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమా క్రిస్‌మస్ కానుకగా 2023, డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించగానే సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలుపెట్టింది. ఎందుకంటే అక్షయ్ కుమార్ కూడా తాను హీరోగా నటించబోయే ‘బడే మియా, చోటే మియా’ను క్రిస్‌మస్ సందర్భంగానే విడుదల చేయనున్నట్టు గతంలోనే ప్రకటించాడు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ మరో హీరోగా చేయనున్నాడు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కబోతుంది. షారూఖ్ ‘డంకీ’, అక్షయ్ కుమార్ ‘బడే మియా, చోటే మియా’ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఒకేరోజు రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయితే కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, రెండు చిత్రాల నిర్మాతలు చర్చించుకుని దేనినైనా పోటీ నుంచి తప్పిస్తారమో చూడాలి.  



Updated Date - 2022-04-23T00:06:48+05:30 IST