Alia Bhatt తోడి పెళ్లికూతుళ్లకు బహుమతిగా Ranbir Kapoor ఎంత డబ్బు ఇచ్చాడంటే..

ABN , First Publish Date - 2022-04-22T21:57:33+05:30 IST

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.

Alia Bhatt తోడి పెళ్లికూతుళ్లకు బహుమతిగా Ranbir Kapoor ఎంత డబ్బు ఇచ్చాడంటే..

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అయాన్ ముఖర్జీ, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయి సందడి చేశారు. పెళ్లి అనంతరం ఆలియా భట్ హల్దీ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వేడుక ఓ కలలా జరిగిందని పేర్కొంది. 


ఆలియా భట్ తోడి పెళ్లి కూతుళ్లకు రణ్‌బీర్ కపూర్ భారీ స్థాయిలో డబ్బును బహుమతిగా ఇచ్చాడు. తన చేతిరాతతో ఓ లేఖను కూడా రణ్‌బీర్ రాశాడు. దాదాపుగా రూ.12లక్షలను తోడి పెళ్లి కూతుళ్లకు బహుమానంగా అందించాడు. ‘‘నేను రణ్‌బీర్ కపూర్. ఆలియాకు భర్తను. తోడి పెళ్లికూతుళ్లకు రూ. 12లక్షలను అందిస్తున్నాను’’ అని రణ్‌బీర్ కపూర్ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆలియా సన్నిహిత మిత్రురాలు తాన్య సాహా గుప్తా ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ పిక్స్ నెట్టింట్ వైరల్‌గా మారాయి. ఈ వివాహనికి హాజరు కానప్పటికీ అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కొత్త జంటకు విలాసవంతమైన కానుకలను అందించారు. కత్రినా కైఫ్ రూ.14.5లక్షల విలువైన ప్లాటినం బ్రేస్‌లేట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. దీపికా పదుకొణె ఓ ఖరీదైన వాచ్‌ను కానుకగా అందించింది. బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా లగ్జరీ హ్యాండ్ బ్యాగును బహుమతిగా అందజేశాడు.



Updated Date - 2022-04-22T21:57:33+05:30 IST