వైరల్ పిక్.. ప్రియురాలు, మాజీ భార్యతో హృతిక్ రోషన్ సెల్ఫీ..

ABN , First Publish Date - 2022-04-07T23:27:28+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ ఏడేళ్ల క్రితమే భార్యభర్తలుగా విడిపోయిన

వైరల్ పిక్.. ప్రియురాలు, మాజీ భార్యతో హృతిక్ రోషన్ సెల్ఫీ..

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ ఏడేళ్ల క్రితమే భార్యభర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట తమ 13ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. దంపతులుగా విడిపోయిన అనంతరం ఎవరి దారిని వారు చూసుకున్నారు. అనంతరం హృతిక్ అప్‌కమింగ్ బ్యూటీ సబా ఆజాద్‌తో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. సుసానే ఖాన్, అర్స్‌లన్ గోని అనే వ్యక్తితో ప్రేమలో మునిగితేలుతోంది. కానీ, ఈ బంధాలపై హృతిక్, సుసానే ఎక్కడ కూడా పెదవి విప్పలేదు. 


కొన్ని రోజుల క్రితం హృతిక్ రోషన్-సబా ఆజాద్, సుసానే ఖాన్-అర్స్‌లన్ గోని గోవాలో పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో లవ్ బర్డ్స్ తెగ ఎంజాయ్ చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అందుకు సంబంధించిన అనేక ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పార్టీలో హృతిక్‌ తీసుకున్న ఓ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో సబా ఆజాద్, సుసానే ఖాన్, అర్స్‌లన్ గోని ఉన్నారు. దీంతో లవ్ బర్డ్స్ తమ రిలేషన్ షిప్‌ను అధికారికంగా ప్రకటించారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతకు ముందే ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను నటి పూజా బేడీ అభిమానులతో పంచుకుంది. ఈ పార్టీకి ఫరా ఖాన్, జాయేద్ ఖాన్, దర్శకుడు అభిషేక్ కపూర్ తదితరులు హాజరయ్యారు.   

Updated Date - 2022-04-07T23:27:28+05:30 IST