అందుకే అక్క అంత్యక్రియలకి రాలేకపోయా : సీనియర్ నటుడు

ABN , First Publish Date - 2022-02-08T19:30:32+05:30 IST

కరోనా బారిన పడి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. లెజెండ్ సింగర్ శాశ్వత నిష్క్రమణ ఎంతోమంది అభిమానులను, సినీ ప్రముఖులను షాక్‌కి గురిచేసింది...

అందుకే అక్క అంత్యక్రియలకి రాలేకపోయా : సీనియర్ నటుడు

కరోనా బారిన పడి ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. లెజెండ్ సింగర్ శాశ్వత నిష్క్రమణ ఎంతోమంది అభిమానులను, సినీ ప్రముఖులను షాక్‌కి గురిచేసింది. అయితే ఈ సినీయర్ గాయని అంత్యక్రియలకి ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. కానీ ఆమె ఆప్త మిత్రుడు, సోదరుడిలా భావించే బాలీవుడ్ సినీయర్ నటుడు ధర్మేంద్ర మాత్రం ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీనికి కారణమేంటన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ‘షోలే’ హీరో క్లారిటీ ఇచ్చారు.


ఓ మీడియాతో ధర్మేంద్ర మాట్లాడుతూ.. ‘అక్క మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నాకు ఏదోలా అనిపించింది. అయినప్పటికీ ఆమె అంత్యక్రియలకు వెళ్లేందుకు ఒకటికి మూడుసార్లు సిద్ధమయ్యాను. కానీ ప్రతిసారీ నేనే వెళ్లలేక వెనక్కు తగ్గాను. ఆమె అందరినీ వదిలి వెళుతోంటే చూడడం నా వల్ల కాదు. దీదీ మరణం నన్ను ఎంతో కృంగదీసింది. అందుకే అంత్యక్రియల్లో పాల్గొనలేదు’ అని చెప్పారు.


అంతేకాకుండా.. లతా మంగేష్కర్‌తో ఆయన బంధానికి సంబంధించిన కొన్ని మధురమైన జ్ఞాపకాలను కూడా ధర్మేంద్ర పంచుకున్నారు. ఆమె తనను ఎంత గౌరవిస్తుందో, అభిమానిస్తుందో ఈ నటుడు గుర్తు చేసుకున్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మోటివేషన్ చేసేవారని చెప్పుకొచ్చారు. ఓ సారి ట్విట్టర్‌లో ఉద్వేగభరితమైన పోస్ట్‌ చేయగా.. అది చూసిన లతా మంగేష్కర్ తనకు కాల్ చేసి దాదాపు అరగంటకి పైగా మాట్లాడారని ధర్మేంద్ర గుర్తు చేసుకున్నారు.


కాగా లతా మంగేష్కర్ మరణ వార్త తెలిసిన వెంటనే ధర్మేంద్ర ఆమెతో కలిసి ఉన్న పిక్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసి నివాళి తెలిపారు. ‘మీ మరణాన్ని ఇప్పటికీ మేం నమ్మలేకపోతున్నాం. ప్రపంచం మొత్తం ఈ వార్త విని బాధ పడుతోంది. లతాజీ మేము మిమ్మల్ని మిస్ అవుతాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్‌గా ధర్మేంద్ర రాసుకొచ్చారు.



Updated Date - 2022-02-08T19:30:32+05:30 IST