Bollywood: ఫ్లాప్ టాక్ వచ్చిన భారీ వసూళ్లు సాధించిన చిత్రాలివే..

ABN , First Publish Date - 2022-09-12T21:13:23+05:30 IST

ఏ చిత్రపరిశ్రమలో అయిన ఓ చిత్రం భారీ కలెక్షన్లు సాధించాలంటే.. అది బావుందనే మౌత్ టాక్ రావాల్సిందే.

Bollywood: ఫ్లాప్ టాక్ వచ్చిన భారీ వసూళ్లు సాధించిన చిత్రాలివే..

ఏ చిత్రపరిశ్రమలో అయిన ఓ చిత్రం భారీ కలెక్షన్లు సాధించాలంటే.. అది బావుందనే మౌత్ టాక్ రావాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్నిసార్లు సినిమా విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ మూట గట్టుకున్నప్పటికీ కొన్ని చిత్రాలు మాత్రం భారీ వసూళ్లని సాధించాయి. ఇటీవలే విడుదలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ పరిస్థితి కూడా అదే. భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌‌ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ మూడు రోజుల్లోనే బాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా రూ.125 కోట్ల వారాంతపు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఈ తరుణంలో అలా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న.. కమర్షియల్‌గా మంచి వసూళ్లు సాధించిన సినిమాల గురించి తెలుసుకుందాం..


ప్రేమ్ రతన్ ధన్ పాయో (Prem Ratan Dhan Payo)

సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. 2015లో విడుదలైన విడుదలైన ఈ మూవీకి మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.207 కోట్ల వసూళ్లు సాధించి కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది.


హౌస్‌ఫుల్ 3 (Housefull 3)

అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన కామెడీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 3’. రిలీజైన రోజే ఈ మూవీకి దారుణమైన రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ రూ.85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.110 కోట్లు కొల్లగొట్టింది.


సన్ ఆఫ్ సర్దార్ (Son of Sardaar)

రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మర్యాదరామన్న’. తెలుగులో సూపర్ హిట్లైన ఈ మూవీని హిందీలో ‘సన్ ఆఫ్ సర్దార్’గా రిమేక్ చేశారు. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన ఈ చిత్రం 2012లో విడుదలై నెగిటివ్ రివ్యూలను అందుకుంది. అయినప్పటికీ దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.105 కోట్ల వసూళ్లు రాబట్టుకుంది.


జుడ్వా 2 (Judwaa 2)

వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సీ పన్ను కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జుడ్వా 2’. ఈ సినిమా సైతం విడుదలై రోజే డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ దాదాపు రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.138 కోట్ల వసూలు సాధించింది.

Updated Date - 2022-09-12T21:13:23+05:30 IST