అందుకే సౌతిండియా స్టార్లకి ఆవేశం ఎక్కువ : Kangana Ranaut

ABN , First Publish Date - 2022-01-24T15:45:03+05:30 IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటుంది...

అందుకే సౌతిండియా స్టార్లకి ఆవేశం ఎక్కువ : Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటుంది. అందుకే ఈ బ్యూటీని అభిమానులు, సినీ జనాలు ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తూ ఉంటారు. తాజాగా ఈ భామ సౌతిండియా స్టార్ నటులు, వారి సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్‌పై మరోసారి విమర్శలు చేసింది.


కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సౌతిండియా స్టార్స్ ఆవేశం ఎక్కువని, దానికి కారణాలను రాసుకొచ్చింది. అందులో.. ‘సౌత్ కంటెంట్‌తో పాటు సూపర్ స్టార్స్‌లో అంత ఆవేశం ఉండటానికి కొన్ని కారణాలు.. 

1. వారు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారు.

2. వారు తమ కుటుంబాలను ప్రేమిస్తారు, సంబంధాల విషయంలో వెస్టర్న్ దేశాలను అనుకరించకుండా, వాటిని నిలుపుకుంటారు.

3. వారి వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైనది.


అంతేకాకుండా బాలీవుడ్‌ వారిని భ్రష్టు పట్టించడానికి అనుమతించకూడద’ని కూడా చెప్పింది. అలాగే ఈ స్టోరీలో సౌత్ నుంచి రాబోతున్న సీక్వెల్స్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’, యశ్ ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ పిక్స్‌ని షేర్ చేసింది.

Updated Date - 2022-01-24T15:45:03+05:30 IST