దక్షిణాది సంప్రదాయంలో పెళ్లి చేసుకోబోతున్న కేఎల్.రాహుల్, అతియా శెట్టి

ABN , First Publish Date - 2022-04-21T23:50:32+05:30 IST

బాలీవుడ్‌లో ఈ ఏడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే మాటలే ఎక్కువగా వినిపించాయి. బీ టౌన్‌లో 2022లో అనేకమంది పెళ్లి చేసుకున్నారు. ఫర్హన్ అక్తర్-శిబానీ దండేకర్, రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు.

దక్షిణాది సంప్రదాయంలో పెళ్లి చేసుకోబోతున్న కేఎల్.రాహుల్, అతియా శెట్టి

బాలీవుడ్‌లో ఈ ఏడాది ఎక్కడ చూసినా పెళ్లి, పెళ్లి అనే మాటలే ఎక్కువగా వినిపించాయి. బీ టౌన్‌లో 2022లో అనేకమంది పెళ్లి చేసుకున్నారు. ఫర్హన్ అక్తర్-శిబానీ దండేకర్, రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. వీరి బాటలోనే మరో సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ నడవనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్.రాహూల్ పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. దక్షిణాది సంప్రదాయంలో ఈ వివాహం జరగబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 


బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురిగా అతియా శెట్టి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘హీరో’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనంతరం అనేక సినిమాల్లో నటించినా కూడా ఆశించినంత మేర ఆమెకు సక్సెస్ దక్కలేదు. దీంతో కెరియర్‌లో స్థిరపడాలని ఆమె నిర్ణయించుకుందని సమాచారం. ఈ ఏడాది శీతాకాలంలో కేఎల్. రాహుల్‌‌ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. వివాహనికి సంబంధించిన పనులను ఇప్పటికే మొదలుపెట్టారని సునీల్ శెట్టి కుటుంబంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరికల్లా ఈ జంటను భార్యాభర్తలుగా మనం చూడొచ్చు.

Updated Date - 2022-04-21T23:50:32+05:30 IST