సామ్‌ను ఎందుకు భయపెడుతున్నారు: బాలీవుడ్ హీరో

ABN , First Publish Date - 2022-03-12T21:34:23+05:30 IST

విడాకుల ప్రకటన అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న

సామ్‌ను ఎందుకు భయపెడుతున్నారు: బాలీవుడ్ హీరో

విడాకుల ప్రకటన అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న హీరోయిన్ సమంత. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అందువల్ల ముంబై, హైదరాబాద్‌ల మధ్య ప్రయాణిస్తోంది. భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించి దర్శక, నిర్మాతలతో కూడా చర్చిస్తుంది. 


బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్, సమంత కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఫ్యామిలీమ్యాన్’ క్రియేటర్స్ రాజ్, డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి శుక్రవారం సాయంత్రం దర్శకులు రాజ్, డీకేలను సామ్, వరుణ్ కలిశారు. మీటింగ్ అనంతరం ఇద్దరూ బయటకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. కెమెరాలను క్లిక్‌మనిపించేందుకు ఎగబడ్డారు. కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో సామ్ భయపడిపోయింది. మీడియా నుంచి వరుణ్ ఆమెను తప్పించాడు. ‘‘సమంతను ఎందుకు భయపెడుతున్నారు’’ అని వరుణ్ ఆమెను పక్కకు తీసుకెళ్లి కారును ఎక్కించాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. వీడియో కింద నెటిజన్లు కామెంట్లు కురిపించడం మొదలుపెట్టారు. వరుణ్ ధావన్‌ చేసిన పనికి చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



Updated Date - 2022-03-12T21:34:23+05:30 IST