కొత్త కారు కొన్న షాహిద్ కపూర్.. ధర వింటే షాకే..

ABN , First Publish Date - 2022-03-01T02:09:16+05:30 IST

బాలీవుడ్‌‌ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ ఈ మధ్యనే

కొత్త కారు కొన్న షాహిద్ కపూర్.. ధర వింటే షాకే..

బాలీవుడ్‌‌ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ ఈ మధ్యనే పుట్టిన రోజు జరుపుకొన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ బర్త్ డే బాష్‌లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ పార్టీకి ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే, కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా, మృణాల్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. 


తన పుట్టిన రోజు సందర్భంగా షాహిద్ విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ ఎస్-580 కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారు 500హార్స్ పవర్ ట్విన్ టర్బో ఇంజిన్లతో పనిచేస్తుంది. షాహిద్ కారును కొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాక్లెట్ బాయ్ తన భార్య మీరా రాజ్‌పుత్‌తో కలసి టెస్ట్ డ్రైవ్ చేస్తున్న పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో అతడి అభిమానులు కారు ధర ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు దాని ధర తెలుసుకుని షాకయ్యారు. అతడు కొన్న కారు ధర దాదాపుగా రూ.2.79కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 

 

షాహిద్ ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాలో నటించాడు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 31న విడుదల కావాల్సి ఉన్న కరోనా ఆంక్షలతో వాయిదా పడింది. 

Updated Date - 2022-03-01T02:09:16+05:30 IST