Somy Ali: సల్మాన్ ఖాన్‌పై మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు.. మహిళలను కొట్టే వాడంటూ..

ABN , First Publish Date - 2022-08-20T00:06:26+05:30 IST

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు. వారిలో అందాల తార ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) నుంచి బ్యూటీఫుల్ కత్రినా

Somy Ali: సల్మాన్ ఖాన్‌పై మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు.. మహిళలను కొట్టే వాడంటూ..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎంతోమందితో ప్రేమాయణం నడిపాడు. వారిలో అందాల తార ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) నుంచి బ్యూటీఫుల్ కత్రినా కైఫ్ (Katrina Kaif) వరకు ఎంతో మంది ఉన్నారు. అతడు డేటింగ్ చేసిన వారిలో సీనియర్ నటి సోమీ అలీ (Somy Ali) కూడా ఒకరు. ఈ నటి తాజాగా సల్లూ భాయ్‌పై ‌విరుచుకుపడింది. ‘మైనే ప్యార్ కియా’ (Maine Pyar Kiya)పోస్ట‌ర్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టర్‌లో నిన్నటి తరం హీరోయిన్ భాగ్య శ్రీ కూడా ఉంది. పోస్టర్ కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది. సల్మాన్ పేరును ప్రస్తావించకుండా అతడిని దైవాంశ సంభూతుడిగా కొలవడం ఆపేయాలని చెప్పింది. 


సోమీ అలీ ఈ పోస్టర్ కింద కామెంట్ కూడా చేసింది. ‘‘నాతో సహా ఇతర మహిళలను కొట్టేవాడు. అతడిని దైవాంశ సంభూతుడిగా కొలవడం మానేయండి. మీకు అతడి గురించి ఏం తెలియదు’’ అని సోమీ అలీ చెప్పింది. సల్మాన్ ఖాన్ నటించిన హిట్ చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సోమీ అలీ వీరాభిమాని. సోమీ, సల్మాన్ కలసి ఓ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఏమైందో తెలియదు కానీ ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం ఇద్దరు కలసి కొంతకాలం డేటింగ్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఈ జంట విడిపోయారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’, ‘భాయ్‌జాన్’ సినిమాల్లో నటిస్తున్నాడు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ‘బిగ్‌బాస్-16’ కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. 



Updated Date - 2022-08-20T00:06:26+05:30 IST