Ranveer Singh photoshoot: ఫొటోషూట్ విషయంలో రణ్‌వీర్‌కు సమన్లు

ABN , First Publish Date - 2022-08-14T00:48:03+05:30 IST

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చాడు. శరీరం మీద నూలు పోగు

Ranveer Singh photoshoot: ఫొటోషూట్ విషయంలో రణ్‌వీర్‌కు సమన్లు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ న్యూడ్‌గా ఫొటోలకు ఫొజులిచ్చాడు. శరీరం మీద నూలు పోగు లేకుండా కనిపించాడు. ఆ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోషూట్‌‌తో అతడిపై కేసు నమోదైంది. మహిళల మనోభావాలను కించపరిచాడంటూ ఓ స్వచ్ఛంద సంస్థ రణ్‌వీర్‌కు వ్యతిరేకంగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫొటోషూట్‌ఫై పోలీసులు అతడిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో సమన్లు అందజేశారు. 


రణ్‌వీర్ సింగ్ ఫొటో షూట్‌పై ఓ స్వచ్చంద సంస్థ చెంబూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడు మహిళల మనోభవాలను కించపరిచడంటూ పేర్కొంది. దీంతో ముంబై పోలీసులు సెక్షన్ 292, సెక్షన్ 293, సెక్షన్ 509, ఇన్పర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్ 67ఏ కింద అతడిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. ఆగస్టు 22న దర్యాప్తునకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. తమకు సహకరించాలని కోరారు. బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఫొటో‌షూట్ విషయంలో రణ్‌వీర్‌కు అండగా నిలిచింది. బీ టౌన్ అందాల భామలు ఆలియా భట్, జాన్వీ కపూర్, విద్యా బాలన్ అతడిని వెనకేసుక్కొచ్చారు. హాలీవుడ్ నటుడు బర్ట్ రేనాల్డ్స్ (Burt Reynolds)ను స్ఫూర్తిగా తీసుకుని రణ్‌వీర్ ఈ ఫొటో షూట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani) లో నటిస్తున్నాడు. ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ‘సర్కస్’ (Cirkus) షూటింగ్‌ను కూడా రణ్‌వీర్ పూర్తి చేశాడు. విలియం షేక్ స్పియర్ ‘ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌’ ను ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

Updated Date - 2022-08-14T00:48:03+05:30 IST