హృతిక్ రోషన్-సబా ఆజాద్ పెళ్లి చేసుకోబోతున్నారా.. వీరి కామన్ ఫ్రెండ్ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2022-03-10T01:23:28+05:30 IST

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్‌, బీ టౌన్ బ్యూటీ, సింగర్ అయిన

హృతిక్ రోషన్-సబా ఆజాద్ పెళ్లి చేసుకోబోతున్నారా.. వీరి కామన్ ఫ్రెండ్ ఏమన్నారంటే..?

బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్‌, బీ టౌన్ బ్యూటీ, సింగర్ అయిన సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట అనేక సార్లు డిన్నర్‌కు బయటకు వచ్చి మీడియా కంట కూడా పడింది. సబా కొన్ని రోజుల క్రితం హృతిక్ ఇంటికి కూడా వెళ్లింది. స్టార్ హీరో ఇంట్లో భోజనం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సబాకు హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.  


హృతిక్ రోషన్, సబా ఆజాద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా..? అభిమానులందరికీ తీపి కబురును వినిపించనున్నారా..? ఈ వివరాలన్నింటిని హృతిక్, సబాల కామ్‌న్ ఫ్రెండ్ ఒకరు మీడియాకు తెలిపారు. ‘‘హృతిక్, సబాలకు ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది. హీరో కుటుంబ సభ్యులకు కూడా ఆమె బాగా నచ్చింది. హృతిక్ ఇంటిని సందర్శించినప్పుడు కొన్ని పాటలను కూడా పాడింది. సబా, హృతిక్ మాజీ భార్య సుసానే‌ల మధ్య మంచి రిలేషన్ ఉంది. సుసానేకు పాటలంటే చాలా ఇష్టం. సబా రాసిన లిరిక్స్‌ను ససానేకు పంపిస్తుంది. ఆమె నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది. హృతిక్ కొడుకులు హ్రీహాన్, హ్రీదాన్‌లకు  కూడా సబాపై అభిమానముంది. హృతిక్, సబాలకు ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఈ జంట లేదు’’ అని ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు.

Updated Date - 2022-03-10T01:23:28+05:30 IST