ప్రతి పెళ్లిలో ఎత్తు, పల్లాలు ఉంటాయంటున్న అజయ్ దేవగణ్

ABN , First Publish Date - 2022-04-29T01:22:45+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో అజయ్ దేవగణ్-కాజోల్ ఒకరు. అజయ్, కాజోల్ తొలిసారిగా 1995లో ఓ సినిమా షూటింగ్‌లో కలుసుకున్నారు. అనంతరం నాలుగేళ్లకు 1999లో వీరు పెళ్లి చేసుకున్నారు.

ప్రతి పెళ్లిలో ఎత్తు, పల్లాలు ఉంటాయంటున్న అజయ్ దేవగణ్

బాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో అజయ్ దేవగణ్-కాజోల్ ఒకరు. అజయ్, కాజోల్ తొలిసారిగా 1995లో ఓ సినిమా షూటింగ్‌లో కలుసుకున్నారు. అనంతరం నాలుగేళ్లకు 1999లో వీరు పెళ్లి చేసుకున్నారు. తాజాగా అజయ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నాడు. ప్రతి వివాహంలో ఎత్తు, పల్లాలు ఉంటయని అతడు వివరించాడు. 


పెళ్లి తర్వాత తన జీవితం సాఫీగా సాగిపోతుందని అజయ్ దేవగణ్ చెప్పాడు. ‘‘ప్రతి పెళ్లిలో ఎత్తు, పల్లాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని ఉంటే మంచిది. ఎప్పుడయినా సరే ఇద్దరు ఒకే విధంగా ఆలోచించలేరు. కానీ, తప్పుపొప్పులు, విభేదాలను సామరస్యంగా పరిష్కారించుకోవాలి. ఈ విధంగా చేస్తేనే దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. పురుషులు, మహిళలు వేర్వేరుగా వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. మీరు చేసిన పని తప్పు అయితే దానిని ఒప్పుకుని క్షమాపణాలు అడగాలి. అలా అయితేనే జీవితం బాగుంటుంది. ఇగోకు పోతే ఇబ్బందులు తప్పవు. నాకు కాజోల్ అంటే ఇష్టం. ఆమెపై ప్రేమను వేర్వేరు విధాలుగా చూపిస్తాను’’ అని అజయ్ దేవగణ్ చెప్పాడు. అజయ్, కాజోల్ ‘ఇష్క్’, ‘దిల్ క్యా కరే’, ‘రాజు చాచా’, ‘ప్యార్ తో హోనా హై తా’ వంటి అనేక సినిమాల్లో జంటగా నటించారు. అజయ్ దేవగణ్ తాజాగా ‘రన్ వే-34’ అనే మూవీ చేశాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.


Updated Date - 2022-04-29T01:22:45+05:30 IST