ప్రియురాలిని పొగడ్తలతో ముంచెత్తిన హృతిక్ రోషన్.. ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-03-07T23:38:44+05:30 IST

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌, బీ టౌన్ బ్యూటీ, సింగర్

ప్రియురాలిని పొగడ్తలతో ముంచెత్తిన హృతిక్ రోషన్.. ఏమన్నాడంటే..

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌, బీ టౌన్ బ్యూటీ, సింగర్ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట అనేక సార్లు డిన్నర్‌కు బయటకు వచ్చి మీడియాకు కూడా దర్శనమిచ్చింది. ఆమె కొన్ని రోజుల క్రితం హృతిక్ ఇంటికి కూడా వెళ్లింది. స్టార్ హీరో ఇంట్లో భోజనం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తాజాగా సబాను హృతిక్ పొగడ్తలతో ముంచెత్తాడు. అద్భుతమైన వ్యక్తి అంటూ ఆమెను ప్రశంసించాడు. ఆమె బెంగాలీ సాంగ్‌ను పాడటంతో ఈ కామెంట్ చేశాడు. 


హృతిక్ ప్రియురాలు సబా ఆజాద్ పాట పాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘శక్తి లేకపోవడంతో అస్వస్థతకు లోనయ్యాను. పాడటం తప్ప ఇంకా ఏం చేయలేను. నా చిన్నతనంలో మా అమ్మ,నాన్నలు ‘గూపీ గ్యానే బాఘా బైనే’ సినిమా క్యాసేట్ తీసుకు వచ్చారు. కొద్దిరోజుల్లోనే ఆ చిత్రాన్ని మా కుటుంబమంతా చూసింది. అప్పుడు నాకు బెంగాళీ భాష అర్థం అయ్యేది కాదు. కానీ, కొన్నాళ్లకే ఆ క్యాసేట్ నా ఫేవరేట్‌గా మారిపోయింది. పాటలోని ప్రతి పదం అర్థం నాకు తెలియదు. అయినా, ప్రతి పాటకు సంబంధించిన లిరిక్‌ను నేను నేర్చుకున్నాను. అదే మ్యూజిక్ గొప్పతనం. సంగీతానికి భాషతో సంబంధం లేదు. నేర్చుకోవాలని తపన ఉంటే చాలు. కొన్ని రోజుల క్రితం ఓ సాయంత్రాన్ని స్నేహితులతో గడుపుతున్నప్పుడు అందరం పాటలను అలపించాం. అప్పుడే నాకు అన్ని లిరిక్స్ గుర్తున్నాయని అర్థమైంది. నాకిష్టమైన ఆ పాట మీ కోసం. నాకు కనుక ధైర్యం వస్తే అన్ని పాటలను మీ కోసం పాడతాను’’ అని సబా ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.       


సబా ఆజాద్ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయగానే అన్నివైపులా నుంచి కామెంట్ల వర్షం కురిసింది. ‘‘నువ్వు అద్భుతమైన వ్యక్తివి’’ అని హృతిక్ చెప్పాడు. ఆ కామెంట్‌కు సబా రిప్లై ఇచ్చింది. ‘‘నువ్వు దయకలవాడివి’’ అంటూ స్పందించింది. బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ కూడా కామెంట్ చేసింది. లిరిక్స్‌ను అద్భుతంగా పలికావని చెప్పింది.



Updated Date - 2022-03-07T23:38:44+05:30 IST