ఇంటి మీద బెంగ పట్టుకుందన్న హృతిక్ ప్రియురాలు.. స్టార్ హీరో ఫ్యామిలీ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-03-04T21:46:11+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌ అప్‌కమింగ్ బ్యూటీ సబా ఆజాద్‌తో

ఇంటి మీద బెంగ పట్టుకుందన్న హృతిక్ ప్రియురాలు.. స్టార్ హీరో ఫ్యామిలీ ఏం చేసిందంటే..

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌ అప్‌కమింగ్ బ్యూటీ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఈ జంట డిన్నర్‌కు బయటకు వచ్చి మీడియా కంట కూడా పడింది. ఆమె కొన్ని రోజుల క్రితం హృతిక్ ఇంటికి కూడా వెళ్లింది. స్టార్ హీరో ఇంట్లో భోజనం చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

  

తాజాగా హృతిక్ ఫ్యామిలీ సబాకు ఇంటి భోజనాన్ని పంపించింది. హీరో కుటుంబ సభ్యులు ఆమెకు పిజ్జా, పాస్తాను పంపించారు. ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తనకు ఇంటి మీద బెంగ పట్టుకుందని ఫాలోయర్స్‌తో చెప్పింది. దీంతో ఆ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేయడం మొదలయ్యాయి. హృతిక్, సబాల రిలేషన్‌షిప్ బలపడిందని నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  


సబా ఆజాద్ గతంలో ‘దిల్ కబడ్డీ’, ‘ముఝసే ఫ్రెండ్ షిప్ కరోగీ’ చిత్రాల్లో నటించింది. నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్‌తో 2013లో డేటింగ్ చేసింది. తర్వాత ఈ జంట దాదాపు 7ఏళ్ల పాటు రిలేషన్ షిప్‌ను కొనసాగించింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ బంధానికి బీటలు వారింది. దీంతో ఈ జంట 2020లో విడిపోయింది. కొన్నాళ్లకు ఆమెకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హృతిక్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో గత కొన్ని నెలలుగా హృతిక్‌తో డేటింగ్ చేస్తోంది. 



Updated Date - 2022-03-04T21:46:11+05:30 IST