rumoured GF ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన Hrithik Roshan... ఏమన్నాడంటే...

ABN , First Publish Date - 2022-02-26T02:40:48+05:30 IST

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌.. గత కొన్ని రోజులుగా

rumoured GF ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన Hrithik Roshan... ఏమన్నాడంటే...

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌.. గత కొన్ని రోజులుగా ఓ అజ్ఞాత సుందరితో డేటింగ్ చేస్తున్నాడు. ఆమెతో కలిసి డిన్నర్ చేసేందుకు బయటికి వచ్చి కెమెరాల కంటికి చిక్కాడు. ఆ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. హృతిక్ రోషన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలో హృతిక్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లిన అమ్మాయి ఎవరు అనే విషయంపై నెటిజన్లు ఆరాలు తీశారు. చివరకు ఆమె అప్ కమింగ్ బాలీవుడ్ యాక్ట్రస్ సబా ఆజాద్ అని కనిపెట్టారు. ఆమె గతంలో ‘దిల్ కబడ్డీ’, ‘ముఝ్‌సే ఫ్రెండ్ షిప్ కరోగీ’ చిత్రాల్లో నటించింది. 


హృతిక్‌తో డేటింగ్ సంగతి కన్‌ఫర్మ్ కానప్పటికీ సబా ఆజాద్ స్టార్ హీరో ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజుల క్రితం లంచ్ చేసింది. అందుకు సంబంధించిన పిక్‌ని హృతిక్ బంధువు రాజేష్ రోషన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వార్తలకి మరింత బలం చేకూరినట్లైంది. తాజాగా హృతిక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సబా ఆజాద్, నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్ షా జంటగా ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. వారిద్దరిని పొగిడాడు. ‘‘కిల్ ఇట్ యూ గాయ్స్’’ అని రాశాడు.  సబా, ఇమాద్‌లకు మ్యాడ్ బాయ్, మింక్ అనే బ్యాండ్ ఉంది. వీరిద్దరూ జంటగా బ్యాండ్ తరఫున ప్రదర్శనలిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం హృతిక్ మాజీ భార్య సుసానే ఖాన్ కూడా సబాను పొగుడుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.




Updated Date - 2022-02-26T02:40:48+05:30 IST