న్యూయార్క్ వీధుల్లో డిజైనర్ వేర్‌ను కొంటున్న ఫరా ఖాన్.. దొరికిపోయావ్ అంటూ కరణ్ జోహార్ పోస్ట్..

ABN , First Publish Date - 2022-04-10T22:15:23+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కరణ్ జోహార్, ఫరా ఖాన్ మంచి స్నేహితులన్న సంగతి అందరకి తెలిసిందే

న్యూయార్క్ వీధుల్లో డిజైనర్ వేర్‌ను కొంటున్న ఫరా ఖాన్.. దొరికిపోయావ్ అంటూ కరణ్ జోహార్ పోస్ట్..

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కరణ్ జోహార్, ఫరా ఖాన్ మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరికి గత 25ఏళ్లుగా పరిచయముంది. అప్పుడప్పుడు పార్టీల్లోను కలుసుకొని విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలోను ఒకరి మీద మరొకరు జోక్స్ వేసుకుంటుంటారు. తాజాగా ఫరా ఖాన్‌ను ప్రస్తావిస్తూ కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 


కరణ్ జోహార్, ఫరా ఖాన్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫరాకు చెందిన ఓ ఫొటోను కరణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దొరికిపోయావ్ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ‘‘న్యూయార్క్ వీధుల్లో హై ఎండ్ డిజైనర్ వేర్‌ను కొంటున్నావా. షోఆఫ్ చేస్తున్నావా’’ అంటూ కరణ్ ప్రశ్నించాడు. కరణ్ పోస్ట్‌కు ఫరా ఖాన్ రిప్లై ఇచ్చింది. లాఫింగ్ ఎమోజీలతో స్పందించింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. కరణ్ జోహార్ దాదాపుగా ఐదేళ్ల అనంతరం  డైరెక్టర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, షబనా అజ్మీ, జయా బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరగా కరణ్ ‘యే దిల్ హై ముష్కిల్’ అనే చిత్రానికి డైరెక్షన్ చేశాడు. ‘హునార్భాజ్’ అనే రియాలిటీ షోకు కూడా జడ్జీగా వ్యవహారిస్తున్నాడు.



Updated Date - 2022-04-10T22:15:23+05:30 IST