‘న్యూటన్’ పాన్ కార్డు దుర్వినియోగం

ABN , First Publish Date - 2022-04-02T21:52:22+05:30 IST

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా

‘న్యూటన్’ పాన్ కార్డు దుర్వినియోగం

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజ్ కుమార్ రావ్. ‘క్వీన్’, ‘న్యూటన్’, ‘స్త్రీ’, ‘లూడో’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు. ఈ మధ్యనే ‘బధాయి దో’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. తన పాన్ కార్డు దుర్వినియోగమైందని తాజాగా రాజ్‌కుమార్ రావ్ ఆరోపించాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 


‘‘నా పాన్ కార్డు దుర్వినియోగమైంది. నా పేరును ఉపయోగించుకుని రూ.2500లను లోన్‌గా తీసుకున్నారు. దీంతో నా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ఈ సమస్యను పరిష్కరించాలని సిబిల్‌ను కోరుతున్నాను’’ అని రాజ్ కుమార్ రావ్ తెలిపాడు. బాలీవుడ్ అందగాడు ఈ ఏడాది రెండో సారి మోసపోయాడు. అంతకు ముందు.. తన పేరును కొందరు దుర్వినియోగం చేశారని.. రూ.3కోట్ల మేరకు మోసం చేసే ఉద్దేశంతో ఇతరులకు మెయిల్ పంపిచారని రాజ్ కుమార్ రావ్ పేర్కొన్నాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రాజ్ కుమార్ రావ్ ఈ మధ్యనే ‘బధాయి దో’ చిత్రంతో అభిమానులను అలరించాడు. ఈ మూవీలో భూమి ఫడ్నేకర్ కీలక పాత్ర పోషించింది. ‘మోనికా’, ‘ఓ మై డార్లింగ్’ అనే ప్రాజెక్టులు కూడా అతడి చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలు 2022లోనే విడుదల కానున్నాయి.



Updated Date - 2022-04-02T21:52:22+05:30 IST