Brahmastram: ‘బ్రహ్మాస్త్రం’ ఇంకా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది

ABN , First Publish Date - 2022-09-19T20:07:31+05:30 IST

గత శుక్రవారం (సెప్టెంబర్ 16న) నాడు తెలుగులో మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అవి.. సుధీర్ బాబు(Sudheer Babu), కృతి శెట్టి (Krithi Shetty) నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’..

Brahmastram: ‘బ్రహ్మాస్త్రం’ ఇంకా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది

గత శుక్రవారం (సెప్టెంబర్ 16న) నాడు తెలుగులో మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అవి.. సుధీర్ బాబు(Sudheer Babu), కృతి శెట్టి (Krithi Shetty) నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు  చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali), అలాగే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (Nenu Meeku Baga Kavalsina Vaadini), ఇంకో సినిమా రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) నటించిన ‘శాకిని డాకిని’ (Saakini Daakini) విడుదల అయ్యాయి. అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్‌ (Box Office) దగ్గర బోల్తా పడ్డాయి. కలెక్షన్స్ (Collections) ఏమాత్రం రాబట్టలేకపోయాయి. మొదటి వారమే కలెక్షన్స్ ఇలా ఉంటే.. ఈ సినిమాలు రెండో వారానికి ఆడటం కూడా కష్టమే. ఈ సినిమాలు అన్నింట్లో తెలిసిన యాక్టర్స్, దర్శకులు వున్న కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.


ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాపై విడుదలకి ముందు కొంచెం ఆసక్తి చూపించారు.. అయితే అది ఘోరంగా విఫలం అయింది. అలానే కిరణ్ అబ్బవరం చాలా కాన్ఫిడెంట్‌గా తన సినిమా ఆడుతుంది అనుకున్నాడు, కానీ అతని ఆశలు గల్లంతు అయ్యాయి. కోడి రామకృష్ణగారి అమ్మాయి ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఈ సినిమాతో అడుగు పెట్టారు, కానీ సినిమా ఆడలేదు. సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి కలిసి నిర్మించిన చిత్రం ‘శాకిని డాకిని' ఒక కొరియన్ సినిమాకి రీమేక్. ఇది విడుదల సమయంలో వివాదంలో పడింది. దీనికి దర్శకుడు సుధీర్ వర్మ అయినా అతను ప్రమోషన్స్‌కి రాలేదు. ఈ సినిమాలన్నీ ఇలా ఉంటే, తెలుగులో విడుదల అయిన బ్రహ్మాస్త్రం (Brahmastram) కలెక్షన్స్‌లో ఇంకా తన సత్తా చాటుతోంది. ఆ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఈ వారంతో కలిపి అది సుమారు రూ.20 కోట్లకి పైగా కలెక్షన్ సాధించింది. ఒక హిందీ సినిమా తెలుగు డబ్బింగ్‌‌ మూవీగా విడుదల అయ్యి ఇంత మంచి కలెక్షన్లు సాధించడం నిజంగా అబ్బురమే. ఇక శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఈ వారం కూడా కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రభావం చూపించలేదు.

Updated Date - 2022-09-19T20:07:31+05:30 IST