బాలీవుడ్ డైరెక్టర్ Luv Ranjan పెళ్లి.. ఇంతకీ, అతడి Lady Love ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-18T02:00:55+05:30 IST

‘ప్యార్ కా పంచ్ నామా’, ‘సోనూ కే టీటు కి స్వీటీ’ వంటి హిట్ సినిమాలతో బాలీవుడ్

బాలీవుడ్ డైరెక్టర్ Luv Ranjan పెళ్లి.. ఇంతకీ, అతడి Lady Love ఎవరో తెలుసా?

‘ప్యార్ కా పంచ్ నామా’, ‘సోనూ కే టీటు కి స్వీటీ’ వంటి హిట్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు లవ్ రంజన్. అతడు త్వరలోనే పెళ్లి చేసుకొబోతున్నాడు. తన ప్రియురాలిని ఫిబ్రవరి 20న వివాహమాడనున్నాడు. తను పెళ్లి చేసుకొబోయేది ఎవరిననే విషయాన్ని లవ్ రంజన్‌తో సహా ఎవరు కూడా ఇంత కాలం బయటపెట్టలేదు.


లవ్ రంజన్ ప్రియురాలి పేరు తాజాగా బయటకొచ్చింది. ఆమె పేరు అలీషా వైద్ అని తెలుస్తోంది. కాలేజీలో చదువుకునే రోజుల నుంచే వీరిద్దరికి పరిచయమయింది. ఇద్దరికి ఆర్ట్స్ అంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే ఒకరికి మరొకరు దగ్గరయ్యారు. ఆగ్రాలో ఫిబ్రవరి 20న లవ్ రంజన్, అలీషా పెళ్లి చేసుకొబోతున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని లవ్ రంజన్ సన్నిహితుడొకరు తెలిపారు. పెళ్లికి సంబంధించిన పనులు ఫిబ్రవరి 18న మొదలవుతాయని పేర్కొన్నారు. గత వారం లవ్ రంజన్, అలీషాతో కలిసి బాలీవుడ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రాను కలిసినట్టు తెలిపారు. పెళ్లిలో ధరించబోయే దుస్తులను ఫైనలైజ్ చేశారని వెల్లడించారు.



Updated Date - 2022-02-18T02:00:55+05:30 IST