పెళ్లి పీటలెక్కబోతున్న బాలీవుడ్ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-02-11T21:12:23+05:30 IST

‘ప్యార్ కా పంచ్ నామా’, ‘సోనూ కే టీటు కి స్వీటీ’ వంటి హిట్ సినిమాలతో దర్శకుడు లవ్ రంజన్

పెళ్లి పీటలెక్కబోతున్న బాలీవుడ్ డైరెక్టర్

‘ప్యార్ కా పంచ్ నామా’, ‘సోనూ కే టీటు కి స్వీటీ’ వంటి హిట్ సినిమాలతో దర్శకుడు లవ్ రంజన్ బాలీవుడ్ రికార్డులను తిరగరాశాడు. అతడు త్వరలోనే పెళ్లి చేసుకొబోతున్నాడు.  తన ప్రియురాలిని ఫిబ్రవరి 20న వివాహమాడనున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులను మాత్రమే హాజరవుతారని లవ్ రంజన్ సన్నిహితుడొకరు తెలిపారు. ఈ పెళ్లి ముంబైలో జరగడంలేదని.. డెస్టినేషన్ వెడ్డింగ్ స్టైల్‌లో జరుగుతుందని చెప్పారు. పెళ్లికి సంబంధించిన పనులు ఫిబ్రవరి 18న మొదలవుతాయని పేర్కొన్నారు. గత వారం లవ్ రంజన్, అతడి ప్రియురాలితో కలిసి బాలీవుడ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రాను కలిసినట్టు తెలిపారు. పెళ్లిలో ధరించబోయే దుస్తులను ఫైనలైజ్ చేశారని వెల్లడించారు.


అయితే, లవ్ రంజన్ జనవరిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కోవిడ్ ఆంక్షలతో వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. తాజాగా ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడంతో ఈ నెలలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం లవ్ రంజన్ ఓ రొమాంటిక్ కామెడీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రణ్ బీర్‌ కపూర్, శ్రద్దా కపూర్ హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివాహానంతరం సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టానున్నారు.

Updated Date - 2022-02-11T21:12:23+05:30 IST