Raju Srivastava: సినీ ప్రరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి

ABN , First Publish Date - 2022-09-21T17:34:13+05:30 IST

‘మైనే ప్యార్ కియా’, ‘బాజీగర్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్‌లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటుడు రాజు శ్రీవాత్సవ.

Raju Srivastava: సినీ ప్రరిశ్రమలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి

‘మైనే ప్యార్ కియా’, ‘బాజీగర్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్‌లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటుడు రాజు శ్రీవాత్సవ (Raju Srivastava). ఈయనకి కమెడియన్‌గానే కాకుండా స్టాండప్ కమెడియన్‌(Comedian)గానూ మంచి పాపులారిటీ సాధించిన రాజు శ్రీవాత్సవ కన్నుముశారు. 58 ఏళ్ల ఈ నటుడు గతనెల జిమ్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా.. నటుడిని వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.


చాలా రోజులపాటు శ్రీవాత్సవని వెంటిలేటర్‌పై ఉంచగా.. ఆయన కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే.. ఇటీవలే మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. ఆయన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని వైద్యులు చెప్పుకొచ్చారు. శ్రీవాత్సవ మరణ విషయం తెలిసి బాలీవుడ్ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. దాంతో.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియ వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ‘కామెడీ ప్రపంచానికి డార్క్ డే’, ‘మీ ఆత్మకి శాంతి చేకూరాలి’, ‘మిమ్మల్ని మిస్ అవుతాం’ అని రాసుకొస్తున్నారు.











Updated Date - 2022-09-21T17:34:13+05:30 IST