Bollywood: అక్టోబర్‌లోనే బీ టౌన్ సెలబ్రిటీ లవర్స్ పెళ్లి

ABN , First Publish Date - 2022-09-16T23:06:44+05:30 IST

బాలీవుడ్‌లో ఈ ఏడాది పెళ్లి భాజాలు బాగానే మారు మోగాయి. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) -ఆలియా భట్ (Alia Bhatt), సూరజ్ నంబియార్ -మౌని రాయ్ ఇప్పటికే పెళ్లి పీటలను ఎక్కారు. ఈ జాబితాలోకి

Bollywood: అక్టోబర్‌లోనే బీ టౌన్ సెలబ్రిటీ లవర్స్ పెళ్లి

బాలీవుడ్‌లో ఈ ఏడాది పెళ్లి భాజాలు బాగానే మారు మోగాయి. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) -ఆలియా భట్ (Alia Bhatt), సూరజ్ నంబియార్  -మౌని రాయ్ ఇప్పటికే పెళ్లి పీటలను ఎక్కారు. ఈ జాబితాలోకి మరో జంట చేరబోతున్నారు. తాము త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ఆ సెలబ్రిటీ లవర్స్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. 


బాలీవుడ్ సెలబ్రిటీ లవర్స్ ఆలీ ఫజల్‌ (Ali Fazal), రిచా చద్దా (Richa Chadha) తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పారు. అక్టోబర్‌లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపారు. రిచా చద్దా ఓ మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘కొత్త ప్రయాణం మొదలుకాబోతుంది. అక్టోబర్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని రిచా ట్వీట్ చేసింది. రిచా చద్దా, ఆలీ ఫజల్ ఏప్రిల్ 2020లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, కోవిడ్ ఆంక్షలు, లాక్‌డౌన్ వంటి పలు కారణాలతో వివాహాన్ని రెండు సార్లు వాయిదా వేసుకున్నారు. రిచా చద్దా, ఆలీ ఫజల్ పెళ్లి పనులు ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. ముంబైలో ఆ వేడుకలు ముగియనున్నాయి. సన్నిహితులు, మిత్రులు కోసం ఈ జంట రెండు రిసెప్షన్స్‌ను ఏర్పాటు చేశారు. మొదటి రిసెప్షన్ ఢిల్లీలో అక్టోబర్-2న, రెండో రిసెప్షన్ ముంబైలో అక్టోబర్-7న ఇవ్వనున్నారు.   


ఆలీ ఫజల్, రిచా చద్దా మొదటిసారిగా ‘ఫక్రే’ (Fukrey) లో కలసి నటించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో దశాబ్దాకాలంగా వారు డేటింగ్ చేస్తున్నారు. మొదట్లో వీరిద్దరు తమ బంధం గురించి ఎక్కడ పెదవి విప్పలేదు. కొంతకాలం క్రితం ఆలీ ఫజల్ నటించిన సినిమాకు ఈ జంట చేతిలో చేయి వేసుకుని కనిపించి అందరికి షాకిచ్చారు. తాము డేటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఆలీ, రిచా ‘పుషింగ్ బటన్స్ స్టూడియో’ అనే సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. 

Updated Date - 2022-09-16T23:06:44+05:30 IST