ఈ ఏడాదే అలియా భట్- రణ్‌బీర్ కపూర్‌ పెళ్లి..?

ABN , First Publish Date - 2022-03-25T23:08:52+05:30 IST

బాలీవుడ్ సెలబ్రెటీలందరూ ఒకరి తర్వాత మరొకరు

ఈ ఏడాదే అలియా భట్- రణ్‌బీర్ కపూర్‌ పెళ్లి..?

బాలీవుడ్ సెలబ్రెటీలందరూ ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలను ఎక్కుతూనే ఉన్నారు. గతేడాది విక్కీ కౌశల్- కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, మౌనీరాయ్-సూరజ్ నంబియార్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్- అలియా భట్ నడవనున్నారని తెలుస్తోంది. ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే దాంపత్య జీవితాన్ని ఆరంభించనున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 


రణ్‌బీర్ కపూర్- అలియా భట్ గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ బంధాన్ని మరో మెట్టు పైకెక్కించాలని ఈ లవ్‌బర్డ్స్ భావిస్తున్నారు. ఎన్నాళ్లగానో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. గతేడాదే వీరి వివాహం అవుతుందని అందరూ భావించారు. కానీ, పలు కారణాల వల్ల కొత్త ప్రయాణాన్ని ఆరంభించలేకపోయారు. ఈ జంట 2022లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టు బీ టౌన్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సెలబ్రెటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రాతో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ దర్శనమివ్వడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది. మనీశ్‌ను పెళ్లి దుస్తుల డిజైన్ కోసమే నీతూ కలసిందని బాలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, మిస్ భట్ నుంచి మిసెస్ కపూర్‌గా అలియా భట్ మారనుందా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇక భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో అలియా, రణ్ బీర్ తొలిసారి కలసి నటించారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించగా...  ఈ ఏడాది సెప్టెంబర్ 9న ‘బ్రహ్మాస్త్ర’  విడుదల కానుంది.

Updated Date - 2022-03-25T23:08:52+05:30 IST