పెళ్లి షాపింగ్‌ను అలియా - రణ్‌బీర్ మొదలుపెట్టరా..?

ABN , First Publish Date - 2022-03-27T00:18:01+05:30 IST

సెలబ్రెటీ లవ్‌బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి

పెళ్లి షాపింగ్‌ను అలియా - రణ్‌బీర్ మొదలుపెట్టరా..?

సెలబ్రెటీ లవ్‌బర్డ్స్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల పెళ్లి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట 2022 ఏప్రిల్‌లో వివాహం చేసుకోబోతోందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ పెళ్లి షాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. శారీ కోచుర్ బ్రాండ్‌లో వీరు పెళ్లి కూతురి చీరలను సెలక్ట్ చేసినట్టు బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది. శారీ కోచుర్ బ్రాండ్ సీఈవో బీనా కన్నాన్‌తో అలియా, రణ్ బీర్ జంటగా ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. బీనా కన్నాన్ సెలబ్రెటీ డిజైనర్. పెళ్లి కూతురి వస్త్రాలను రూపొందిస్తుంటుంది. కాంచీపురం చీరలను రూపొందించడంలో ఆమెకు మంచి పేరు ఉంది.     


అలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఈ మధ్యనే ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా వారణాసిలో జరిగింది. ఈ జంట నేరుగా అక్కడి నుంచి వచ్చి పెళ్లి షాపింగ్ చేయడం ఆసక్తికరమైన అంశం. ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారడంతో .. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని నెటిజన్లందరూ కామెంట్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో అలియా, రణ్ బీర్ తొలిసారి కలసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. ఈ మూవీకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. గతేడాది అనేక మంది బాలీవుడ్ సెలబ్రెటీలు పెళ్లి చేసుకున్నారు. విక్కీ కౌశల్- కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, మౌనీరాయ్-సూరజ్ నంబియార్ వంటి లవ్ బర్డ్స్ కొత్తగా దాంపత్య జీవితాన్ని ఆరంభించారు.



Updated Date - 2022-03-27T00:18:01+05:30 IST