Ranveer Singh: మరో ఇంటిలోకి రణ్‌వీర్, దీపిక.. విశేషాలు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-20T01:53:56+05:30 IST

బాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. ఈ జంట అలీబాగ్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సముద్ర తీరానికి దగ్గరలో ఈ

Ranveer Singh: మరో ఇంటిలోకి రణ్‌వీర్, దీపిక.. విశేషాలు ఏంటంటే..

బాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. ఈ జంట అలీబాగ్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సముద్ర తీరానికి దగ్గరలో ఈ ఇల్లు ఉంది. తాజాగా ఈ జంట అలీబాగ్‌లోని ఇంటిలోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను రణ్‌వీర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ భవనం మొత్తం 2.5ఎకరాల్లో విస్తరించి ఉంది. 18వేల చదరపు అడుగుల్లో ఇల్లు ఉంది. ఈ ఇంటిలో ఐదు బెడ్ రూంలు ఉన్నాయి. ఈ భవంతి ధర రూ. 22కోట్లు అని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. కొత్త ఇంటిని ఈ దంపతులు విడిది కేంద్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రణ్‌వీర్, దీపిక ముంబై‌లోని ప్రభాదేవి ప్రాంతంలో నివసిస్తున్నారు. 


రణ్‌వీర్, దీపిక మొదటగా ‘రామ్ లీలా’ లో నటించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి పీటలను ఎక్కారు. ఈ జంట ఇటలీలో రెండు సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం తొలిసారిగా వీరిద్దరు ‘83’ లో నటించారు. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ చేతిలో వరుస ప్రాజెక్టున్నాయి. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), ‘సర్కస్’ (Cirkus) సినిమాల్లో నటిస్తున్నాడు. దీపికా పదుకొణె ‘పఠాన్’, ‘ఫైటర్’, ‘ద ఇంటర్న్’, ‘ప్రాజెక్ట్-కె’ వంటి చిత్రాలు చేస్తుంది.



Updated Date - 2022-08-20T01:53:56+05:30 IST