Bollywood box office Report 2022: బాలీవుడ్ లో ఈ 6 నెలల్లో కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-07-05T00:58:05+05:30 IST

కరోనాతో సినీ పరిశ్రమ కుదేలైపోయింది. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గిపోయారు. ఓటీటీలకు అంకితమై పోతున్నారు. అయినప్పటికీ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో చిత్రాలను నిర్మిస్తున్నారు. థియేటర్స్‌లో

Bollywood box office Report 2022: బాలీవుడ్ లో ఈ 6 నెలల్లో కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాల లిస్ట్ ఇదీ..!

కరోనాతో సినీ పరిశ్రమ కుదేలైపోయింది. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గిపోయారు. ఓటీటీలకు అంకితమై పోతున్నారు. అయినప్పటికీ నిర్మాతలు భారీ బడ్జెట్‌తో చిత్రాలను నిర్మిస్తున్నారు. థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను మెప్పించాయి. అలా ప్రేక్షకులను అలరించి 6నెలల కాలంలో కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన సినిమాలపై ఓ లుక్కేద్దామా... 


బాలీవుడ్‌లో వసూళ్ల సునామీ ‘గంగూబాయి కతియవాడి’(Gangubai Kathiawadi) తో ప్రారంభమైంది. ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం రూ. 130కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘ద కశ్మీర్ పైల్స్’ (The Kashmir Files), ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR), ‘కెజియఫ్: చాప్టర్-2’ (KGF Chapter 2) కూడా కలెక్షన్స్‌ను కొల్లగొట్టాయి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ రూ. 252. 90కోట్ల వసూళ్లను రాబట్టింది. కార్తిక్ ఆర్యన్ నటించిన ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2) రూ. 185కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘కెజియఫ్’ హిందీ వెర్షన్ రూ. 435కోట్ల వసూళ్లను సాధించింది. విజయం ఉన్న చోటే పరాజయం ఉంటుందన్నట్టు, ఈ 6నెలల కాలంలోనే కొన్ని సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. రాజ్ కుమార్ రావ్ నటించిన ‘బధాయి దో’, అక్షయ్ కుమార్ హీరోగా చేసిన ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూశాయి. ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘జెర్సీ’, ‘రన్ వే-34’, ‘ధాకడ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. 


గతేడాది తొలి 6నెలల్లో బాలీవుడ్ సినిమాలు రూ.2300కోట్ల వసూళ్లను సాధించాయి. కానీ, ఈ ఏడాది మాత్రం రూ. 2000కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అందులోను సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్ ద్వారానే రూ. 1000కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో రాబోయే 6నెలలపై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ కాలంలోనే.. ‘షంషేరా’, ‘విక్రమ్ వేద’, ‘రామ్ సేతు’, ‘లాల్ సింగ్ చద్దా’, ‘సర్కస్’ వంటి చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ సినిమాలైనా ప్రేక్షకులను మెప్పిస్తాయో, లేదో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

Updated Date - 2022-07-05T00:58:05+05:30 IST