ఇంటికి వచ్చిన బంధువులు.. తన దుస్తుల్ని చూసి ఏం చేశారో వెల్లడించిన Urfi Javed..!

ABN , First Publish Date - 2022-05-27T00:41:20+05:30 IST

హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ఉర్పీ జావేద్(Urfi Javed). సరికొత్త డ్రెసింగ్ స్టైల్‌తో అభిమానులను అలరిస్తుంటుంది. బోల్డ్ అవుట్ ఫిట్స్ ధరించి తరచు

ఇంటికి వచ్చిన బంధువులు.. తన దుస్తుల్ని చూసి ఏం చేశారో వెల్లడించిన Urfi Javed..!

హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ఉర్పీ జావేద్(Urfi Javed). సరికొత్త డ్రెసింగ్ స్టైల్‌తో అభిమానులను అలరిస్తుంటుంది. బోల్డ్ అవుట్ ఫిట్స్ ధరించి తరచు ఫోజులిస్తుంటుంది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. 


ఉర్పీ జావేద్ ఇంటికి ఓ సారి బంధువులు వచ్చి ఆమె దుస్తులను తదేకంగా పరిశీలించారట. ఈ విషయాని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘నేను బోల్డ్‌గా ఉండటంతో పాటు మంచి దుస్తులు ధరించేదానిని. నా బంధువులకు ఆ విధంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు. అందువల్ల వారు కోపనంతా నా దుస్తులపై చూపించేవారు. కత్తెరతో నా దుస్తులను కత్తిరేంచేవారు. నేను  ఏదో ఒక రోజు వారి దగ్గరికీ వెళ్లి బుద్ది చెప్పాలనుకున్నాను. ప్రస్తుతం నేను ఫేమ్ సంపాదించుకున్నాను. కాబట్టి ఆ బంధువులందరు నాతో సెల్ఫీ తీసుకోవడానికీ ఎగబడుతున్నారు. నన్ను పాపులర్ చేసినందుకు ఫొటోగ్రాఫర్స్‌కు, సోషల్ మీడియాకు థ్యాంక్స్. నా దగ్గర డబ్బులు ఉంటే ప్రతి ఫొటోగ్రాఫర్‌కు కారుతో పాటు ఇంటిని బాహుకరించేదానిని. నా పెళ్లికి వారినే ముఖ్య అతిథులుగా పిలుస్తాను. బాలీవుడ్ స్టార్స్ కంటే నా పిక్స్ వల్లనే ఫొటోగ్రాఫర్లకు అధికంగా ఆదాయం వస్తుంది’’ అని ఉర్పీ జావేద్ చెప్పుకొచ్చింది. 


తన పిక్స్‌ను క్లిక్ చేయడానికి ఫొటోగ్రాఫర్లకు ఉర్పీ జావేద్ భారీగా డబ్బులను చెల్లిస్తుందని బీ టౌన్ మీడియా‌లో గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వదంతులపై కూడా ఉర్పీ స్పందించింది. ‘‘ఎల్లప్పుడు కొంత మంది మనల్ని ప్రశ్నిస్తుంటారు. నేను మరణించిన సరే నా వైపే వేలెత్తి చూపిస్తారు. ఇటువంటి వాటికి నేను ప్రాధాన్యమివ్వను’’ అని ఉర్పీజావేద్ తెలిపింది.  

Updated Date - 2022-05-27T00:41:20+05:30 IST