ఆ విషయాన్ని ‘సుస్మిత వద్ద నేర్చుకోవాలి.. కరణ్ వద్ద కాదు’ అంటూ బాలీవుడ్ అప్‌కమింగ్ బ్యూటీని ట్రోల్ చేసిన నెటిజన్స్

ABN , First Publish Date - 2022-03-27T21:35:42+05:30 IST

బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు సినిమాల్లోకీ రాకముందే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది

ఆ విషయాన్ని ‘సుస్మిత వద్ద నేర్చుకోవాలి.. కరణ్ వద్ద కాదు’ అంటూ బాలీవుడ్ అప్‌కమింగ్ బ్యూటీని ట్రోల్ చేసిన నెటిజన్స్

బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు సినిమాల్లోకీ రాకముందే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వారు కూడా ఘనంగానే బీ టౌన్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా సంజయ్ కపూర్, మహీప్ కపూర్‌ల ముద్దుల కూతురు శనాయా కపూర్ వెండి తెరపైకీ రంగప్రవేశం చేయనుంది. టాప్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆమెను లాంచ్ చేయనున్నాడు. ప్రస్తుతం ఆమె ఓ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.  


శనాయా కపూర్ అనుకోని కారణాల వల్ల పతాక శీర్షికలకెక్కింది. నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో తాజాగా శనాయా  పాల్గొంది. తొలిసారిగా ర్యాంప్ వాక్ చేసింది. ర్యాంప్‌పై సెలబ్రెటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ఆమె ధరించింది. బాలీవుడ్ స్టార్ సిద్దాంత్ చతుర్వేదితో కలసి ఆమె క్యాట్ వాక్ చేసింది. శనాయా చేసిన వాక్ నెటిజన్లను మెప్పించలేకపోయింది. దీంతో ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘‘ఆమెకు ర్యాంప్ మీద నడవడం రాదు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ర్యాంప్ వాక్‌ ఏలా చేయాలనే విషయాన్ని సుస్మితా సేన్‌ వద్ద నేర్చుకోవాలి.. కరణ్ జోహార్ వద్ద కాదు’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ పోస్ట్ పెట్టాడు ‘‘బాతు నడక’’ అని కొంత మంది నెటిజన్స్ ఎగతాళి చేశారు. 


బాలీవుడ్ అప్ కమింగ్ బ్యూటీ శనాయా కపూర్... ‘గుంజన్ సక్సేనా’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయిన ‘ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ అనే వెబ్‌సిరీస్‌‌లో అతిథి పాత్రలో మెరిసింది.



Updated Date - 2022-03-27T21:35:42+05:30 IST