Heeramandi: వెబ్ సిరీస్ కోసం కథక్ డ్యాన్స్ నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-06-30T00:02:42+05:30 IST

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్ కోసం ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ‘హీరామండి’

Heeramandi: వెబ్ సిరీస్ కోసం కథక్ డ్యాన్స్ నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్ కోసం ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ‘హీరామండి’ (Heeramandi) టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. భారతదేశానికీ స్వాతంత్ర్యం రాకముందు వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నారు. ప్రేమ, ద్రోహం, రాజకీయాల నేపథ్యంగా ఈ షో కొనసాగబోతున్నట్టు బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ‘హీరామండి’ లో సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), మనీషా కోయిరాలా (Manisha Koirala), హ్యుమా ఖురేషీ (Huma Qureshi), రిచా చద్దా (Richa Chadha) తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు.ఈ వెబ్ సిరీస్ కోసం రిచా చద్దా ఉచ్చారణ, కథక్ డ్యాన్స్‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రిచా ఈ వెబ్ సిరీస్‌తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


‘హీరామండి’ అనేది భన్సాలీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తి తెలిపారు. ‘‘సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి’ తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందువల్ల ఈ వెబ్ సిరీస్ కోసం తన శక్తి, యుక్తులన్నింటిని కేంద్రీకరిస్తున్నారు. రిచాకు సంబంధించిన లుక్ టెస్ట్స్ చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ సిరీస్‌లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. అందుకోసమే ప్రస్తుతం ‘కథక్’ నేర్చుకుంటున్నారు. గత రెండు వారాలుగా డ్యాన్స్ శిక్షణ తీసుకుంటున్నారు. జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుంది’’ అని భన్సాలీతో సన్నిహితంగా మెలిగే వర్గాలు పేర్కొంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్ దాదాపుగా రూ. 200కోట్లతో ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతుందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఈ బడ్జెట్‌లోనే రూ. 60కోట్ల నుంచి రూ.65కోట్ల వరకు భన్సాలీకీ రెమ్యూ‌నరేషన్‌గా చెల్లించనున్నారని తెలుస్తోంది. భన్సాలీ గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ వెబ్ సిరీస్ ఉంటుందట. సంజయ్ లీలా భన్సాలీ చివరగా ‘గంగూబాయి కతియావాడి’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ కీలక పాత్ర పోషించారు.

Updated Date - 2022-06-30T00:02:42+05:30 IST