జిమ్‌లో సందడి చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్

ABN , First Publish Date - 2022-03-18T23:43:18+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి, సినీ ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగిస్తోన్న

జిమ్‌లో సందడి చేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి, సినీ ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగిస్తోన్న సుందరి దిశా పటానీ. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘లోఫర్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రానికి పూరీ దర్శకుడిగా వ్యవహరించాడు. బాలీవుడ్‌లో తొలి ప్రాజెక్టుగా ‘ఎమ్‌ఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో నటించింది. ఈ మూవీ‌లో ధోనీ లవర్ పాత్రలో కనిపించి యువత గుండెలను కొల్లగొట్టింది. తాజాగా దిశ హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె ‘యోధ’, ‘ఏక్ విలన్-2’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. 


బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి యువతలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు దాదాపుగా 5కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ ఫాలోయర్స్‌ని బట్టే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఆమె సోషల్  మీడియాలో తరచుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. నెటిజన్స్ అందరినీ తన పోస్ట్‌లతో అలరిస్తుంటుంది. తాజాగా దిశ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. చేతులు సాగదీసి వ్యాయామం చేస్తూ కుర్రాళ్లకు వెర్రెక్కేలా వెన్ను చూపించింది! ఆ బ్యాక్ బ్యూటీ వీడియోకు అమాంతం అభిమానులందరూ ఫిదా అయ్యారు. నెట్టింట షేర్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ సందడి చేస్తోంది. ఆ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి...



Updated Date - 2022-03-18T23:43:18+05:30 IST