ప్రెగ్నెంట్ అయిన బిపాసా బసు..?

ABN , First Publish Date - 2022-03-09T21:26:07+05:30 IST

బాలీవుడ్‌లో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటి బిపాసా బసు

ప్రెగ్నెంట్ అయిన బిపాసా బసు..?

బాలీవుడ్‌లో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటి బిపాసా బసు. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ‘టక్కరి దొంగ’ సినిమాలో హీరోయిన్ పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ‘రాజ్’, ‘జిస్మ్’ ‘రేస్’, ధూమ్ చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్ దశలో ఉండగా మూవీస్‌కు బైబై చెప్పింది. అనంతరం కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. బిపాసాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. 


తాజాగా బిపాసా బసు తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి డిన్నర్‌ చేయడానికి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆమె ఓవర్ సైజ్ షర్ట్ ధరించింది. అప్పుడు ఫొటోగ్రాఫర్లు ఆమెను క్లిక్‌ మనిపించారు. ఆ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ మారాయి. ఆ ఫొటోల కింద నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘బిపాసా ప్రెగ్నెంట్ అని నేను అనుకుంటున్నాను’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఆమె కచ్చితంగా గర్భిణే. తల్లి కాబోతోంది కాబట్టే ఓవర్ సైజ్డ్ డ్రెస్ వేసుకుంది’’ అని మరో నెటిజన్ రాశాడు. అయితే, ఈ పుకార్లు నిజమో, కాదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 


బిపాసా-కరణ్ సింగ్ గ్రోవర్ జంటగా ‘ఎలోన్’ సినిమాలో నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కొంతకాలం డేటింగ్ చేశారు. అనంతరం ఏప్రిల్ 30, 2016న పెళ్లి చేసుకున్నారు.



Updated Date - 2022-03-09T21:26:07+05:30 IST