కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన షారూఖ్

ABN , First Publish Date - 2022-04-17T01:13:22+05:30 IST

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించబోయే చిత్రంలో కింగ్ ఖాన్ నటించనున్నాడు.

కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన షారూఖ్

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించబోయే చిత్రంలో కింగ్ ఖాన్ నటించనున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయింది. ముంబైలోని ఫిల్మ్‌సిటీలో ఏప్రిల్ 15న చిత్రీకరణ ప్రారంభమయినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


షారూఖ్ ఖాన్ అభిమానులు గత కొన్నేళ్లుగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయిందనే వార్త తెలియడంతో వారందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం షారూఖ్ రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. యశ్‌రాజ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‘పఠాన్’, అట్లీ తెరకెక్కిస్తున్న ‘లయన్’ లోను హీరోగా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉండగానే మరో కొత్త మూవీని షారూఖ్ పట్టాలెక్కించడం చెప్పుకోదగ్గ విశేషం. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించే చిత్రం సోషల్ కామెడీగా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తాప్సీ ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

Updated Date - 2022-04-17T01:13:22+05:30 IST