Viral Video: Mahesh Babu కామెంట్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల క్రితమే Shah Rukh Khan ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-05-13T23:29:32+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బాలీవుడ్‌(Bollywood) పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. గతంలో బీ టౌన్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హాలీవుడ్‌(Hollywood)

Viral Video: Mahesh Babu కామెంట్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల క్రితమే Shah Rukh Khan ఏమన్నాడంటే..

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) బాలీవుడ్‌(Bollywood) పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. గతంలో బీ టౌన్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హాలీవుడ్‌(Hollywood) పై ఇలాంటి కామెంట్సే చేశాడు. హాలీవుడ్‌లో ఎందుకు నటించడం లేదని అడగగా ఆసక్తికరంగా స్పందించాడు. ‘‘నా ఇంగ్లీష్ బాగుండదు. మాటలు రాని వ్యక్తి పాత్ర నాకు ఇస్తే నటించే అవకాశం ఉంది. నేను అంత అందంగా ఉండను. నటుడికీ ఉండాల్సిన లక్షణాలు లేవు. కుంగ్ ఫూ రాదు. లాటిన్ సల్సా డ్యాన్స్ ఏలా చేస్తారో తెలియదు. కావాల్సినంత పొడుగు కూడా ఉండను. నాలో టాలెంట్ అంతగా లేదు.. అటువంటి వారికీ హాలీవుడ్‌లో చోటు లేదు. అందువల్లే నేను భారత్‌లో మాత్రమే నటిస్తాను. భారతీయ సినిమాలను ప్రపంచస్థాయికి తీసకువెళ్లాలని ఆశిస్తున్నాను’’ అని షారూఖ్ ఖాన్ తెలిపాడు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో 14ఏళ్ల క్రితం బాలీవుడ్ బాద్ షా ఈ కామెంట్స్ చేశాడు.  


ప్రిన్స్ మహేశ్ బాబు ‘మేజర్’(Major) సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా మహేశ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘బాలీవుడ్ నుంచి నాకెన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ, ఆ ఇండస్ట్రీ నన్ను భరించలేదు. అందుకే అక్కడికీ వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. టాలీవుడ్ లో నాకు అమితంగా ప్రేమాభిమానాలు లభిస్తున్నాయి. అందువల్ల ఈ ఇండస్ట్రీని వదిలి వేరే పరిశ్రమకు వెళ్లాలని నేను ఎప్పుడు అనుకోలేదు’’ అని మహేశ్ బాబు పేర్కొన్నాడు.



Updated Date - 2022-05-13T23:29:32+05:30 IST