అమెరికాలో బాలీవుడ్ నటికి చేదు అనుభవం.. అది కావాలనే చేశాడంటూ..

ABN , First Publish Date - 2022-03-24T16:38:16+05:30 IST

బాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్‌తో గుర్తింపు పొందిన నటి స్వర భాస్కర్. ఈ భామ ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఎంజెల్స్‌లో..

అమెరికాలో బాలీవుడ్ నటికి చేదు అనుభవం.. అది కావాలనే చేశాడంటూ..

బాలీవుడ్‌లో సపోర్టింగ్ రోల్స్‌తో  గుర్తింపు పొందిన నటి స్వర భాస్కర్. ఈ భామ ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఎంజెల్స్‌లో ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడి వెళ్లిన ఈ భామకి చేదు అనుభవం ఎదురైంది. ఓ క్యాబ్ డ్రైవర్ ఈ బ్యూటీ వస్తువులను దొంగిలించాడంట. దీని గురించి ఈ నటి సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.


షూటింగ్‌ విరామ సమయంలో స్వర షాపింగ్‌కి వెళ్లింది. అవసరమైన వస్తువులను కొనుకున్న తర్వాత ఉబర్‌లో క్యాబ్‌ని బుక్ చేసుకొని ఎక్కింది. అనంతరం వస్తువులని క్యాబ్‌లోనే ఉంచి ఓ చోట దిగింది. దీంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీని గురించి స్వర చేసిన ట్వీట్‌లో.. ‘హే ఊబర్ సపోర్టు.. లాస్ ఎంజెల్స్‌లో ముందుగా యాడ్ చేసిన స్టాప్‌లో ఉన్నప్పుడు మీ డ్రైవర్ ఒకడు నా వస్తువులను తీసుకొని వెళ్లిపోయాడు. దీని గురించి మీ యాప్‌లో కంప్లైంట్ చేయడానికి కుదరలేదు. నేను వస్తువులని పొగొట్టుకోలేదు. అతనే దొంగతనం చేశాడు. నా వస్తువులని నేను తిరిగి పొందే అవకాశం ఉందా?’ అంటూ రాసుకొచ్చింది.




నటి ట్వీట్‌కి ఊబర్ సపోర్ట్ టీం.. ‘మీ అనుభవం ఖచ్చితంగా మా ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అసలేం జరిగిందో డిఏం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మేము దీన్ని సరిచేయడానికి మీకు సహాయం చేయాలనుకుంటున్నాం’ అని రిప్లై ఇచ్చింది.







Updated Date - 2022-03-24T16:38:16+05:30 IST